ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. నల్లగొండ జిల్లాకు చెందిన మరో కానిస్టేబుల్ ను అదుపులోకి తీసుకుంది హైదరాబాద్ టీం. ఫోన్ ట్యాపింగ్ దందాలో కానిస్టేబుల్ మహిళల వ్యక్తిగత జీవితాల్లోకి ప్రవేశించి బ్లాక్ మెయిల్ చేసినట్లు విచారణలో తేలింది.
అప్పటి జిల్లా పోలీస్ బాస్ తో సాన్నిహిత్యం... ఆ చొరవతో మిగిలిన ఉన్నతాధికారులను బయపెట్టినట్లు పోలీసులు విచారణలో బయటపడింది. ఫోన్ ట్యాపింగ్‌తో జిల్లాలో పలు దందాల్లో జోక్యం చేసుకొని కోట్ల రూపాయలు వసూలు చేశారని వెల్లడైంది. రౌడీ షీటర్లతో సెటిల్ మెంట్స్ తో గుర్రంపోడ్ దగ్గర ఓ పోలీస్ బాస్ బినామీల పేరిట 9 ఎకరాల తోట విక్రయం చేసినట్లు సమాచారం. నార్కట్ పల్లి దగ్గర గంజాయి కేసులో దొరికిన వారి వ్యక్తిగత జీవితాల్లో కానిస్టేబుల్ ప్రవేశించాని గుర్తించారు పోలీసులు. వందల మందికి సంబంధించిన ఫోన్ రికార్డ్స్ విని బెదిరింపులకు పాల్పడి, భారీ వసూలు చేశారని పేర్కొన్నారు.
అదేవిధంగా పట్టుబడిన కానిస్టేబుల్ అనేక మంది మహిళలపై లైంగిక వేధింపులకు పాల్పడ్డారని తేలింది. పేకాట దందాల్లో నెలకు మామూళ్లు కూడా తీసుకునే వారని వివరించారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో విచారణ కొనసాగుతుంది. ఈ కేసులో భాగంగా మరికొంతమందిని పోలీసులు అదుపులోకి తీసుకునే అవకాశముందని తెలిపారు.