టార్గెట్ రష్మిక మందన్న.. వైరల్ అవుతున్న మరో డీప్ఫేక్ వీడియో

టార్గెట్ రష్మిక మందన్న.. వైరల్ అవుతున్న మరో డీప్ఫేక్ వీడియో

సౌత్ బ్యూటీ రష్మిక మందన్న(Rashmika mandanna)కు ఫేక్ వీడియోల తిప్పలు తప్పడంలేదు. ఇటీవలే ఆమె కు సంబందించిన డీప్ ఫేక్ వీడియో(Deepfake video) ఒకటి వైరల్ అయిన విషయం తెలిసిందే. ఆ విషయం టాలీవుడ్ లోనే కాదు.. దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది. స్టార్ సెలబ్రెటీస్ అందరు ఈ వీడియోపై స్పందించారు. ఆ ఫేక్ వీడియో చేసిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. 

ఈ విషయం ఇంకా మరిచిపోకముందే రష్మికకు సంబందించిన మరో ఫేక్ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ వీడియోలో జిమ్ సూట్ వేసుకుని డ్యాన్స్ చేస్తున్నట్లుగా ఉంది రష్మిక. ఈ వీడియోపై ఆమె ఫ్యాన్స్ మండిపడుతున్నారు. ఇది ఫేక్ వీడియో అని, ఎవరూ సీరియస్ గా తీసుకోవద్దని, కావాలనే రష్మికను డీఫేమ్ చేయాలని ఇలాంటివి చేస్తున్నారని కామెంట్స్ చేస్తున్నారు. ఈ విషయాన్ని గవర్నమెంట్ సీరియస్ గా తీసుకోవాలని, దోషులకు చట్టపరంగా శిక్ష విధించాలని డిమాండ్ చేస్తున్నారు. మరి ఈ విషయంపై గవర్నమెంట్ ఎలా స్పందిస్తుంది? ఎలాంటి చర్యలు తీసుకోనుందో? చూడాలి.

ఇక రష్మిక మందన్న సినిమాల విషయానికి వస్తే.. ప్రస్తుతం ఆమె అల్లు అర్జున్(Allu arjun) సరసన పుష్ప2(Pushpa2 the rule) సినిమాలో నటిస్తున్నారు. సుకుమార్(Sukumar) తెరకెక్కిస్తున్న ఈ పాన్ ఇండియా మూవీ వచ్చే ఏడాదికి ఆగస్టు 15న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇక బాలీవుడ్ లో సందీప్ రెడ్డి వంగ(Sandeep reddy vanga), స్టార్ హీరో రణ్బీర్ కపూర్(Ranbir kapoor) కాంబోలో వస్తున్న యానిమల్ సినిమాలో నటిస్తున్నారు రష్మిక. పాన్ ఇండియా లెవల్లో తెరకెక్కిన ఈ మూవీ డిసెంబర్ 1న రిలీజ్ కానుంది. మరి ఈ రెండు సినిమాలు రష్మికకు ఎలాంటి రిజల్ట్ ను ఇవ్వనున్నాయో చూడాలి.