ఐఏఎస్ అధికారులకు కరోనా వైరస్.. అయోమయంలో ప్రభుత్వ పెద్దలు

ఐఏఎస్ అధికారులకు కరోనా వైరస్.. అయోమయంలో ప్రభుత్వ పెద్దలు

మధ్యప్రదేశ్ లో కరోనా వైరస్ సోకిన బాధితుల సంఖ్య పెరుగుతోంది. ముఖ్యంగా పలు శాఖలకు చెందిన ముఖ్య అధికారులకు కరోనా వైరస్ సోకడంపై ప్రభుత్వ పెద్దలు అయోమయానికి గురవుతున్నారు. ఇప్పటి వరకు అందిన సమాచారం ప్రకారం.. మధ్యప్రదేశ్ కు చెందిన నలుగురు ఐఏఎస్ అధికారులకు కరోనా సోకినట్లు తెలుస్తోంది. ఇటీవల ఐఏఎస్ అధికారులకు వైరస్ లక్షణాలు ఉండడంతో వారందరికీ టెస్ట్ లు నిర్వహించారు. ఈ టెస్ట్ ల్లో నలుగురు ఐఏఎస్ అధికారులకు కరోనా సోకినట్లుని ర్ధారించారు. ఈ కరోనా సోకిన నలుగురు ఐఏఎస్ అధికారులు వైద్యశాఖలో కీలక బాధ్యతల్ని నిర్వహిస్తున్నారు. వారిలో ఆరోగ్య శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ, ఆయుష్మాన్ యోజన సిఈఓ ఉన్నారు. అదే సమయంలో  ఐఏఎస్ అధికారి, ఆయన కుమారుడికి పరీక్షలు చేయగా కరోనా పాజిటీవ్ వచ్చింది. దీంతో ఇప్పటి వరకు  మధ్యప్రదేశ్ లో కరోనా సోకిన రోగుల సంఖ్య 142కు చేరింది.