కనకవ్వ నుంచి మరో సినిమా సాంగ్.. ఏదో జరిగే..మునుపెరుగని మాయే

కనకవ్వ నుంచి మరో సినిమా సాంగ్.. ఏదో జరిగే..మునుపెరుగని మాయే

హీరో నవదీప్(Navadeep) సమర్పణలో రవి మహాదాస్యం, విషిక లక్ష్మణ్ జంటగా రాజశేఖర్ సుద్మూన్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘సగిలేటి కథ’. దేవీప్రసాద్ బలివాడ, అశోక్ మిట్టపల్లి నిర్మిస్తున్నారు.  

తాజాగా ఈ మూవీ ఫస్ట్ సాంగ్‌‌ను దర్శకుడు రామ్ గోపాల్ వర్మ రిలీజ్ చేసి పాట బ్యూటిఫుల్‌‌గా ఉందని, టీమ్‌‌కి ఆల్ ద బెస్ట్ చెప్పారు. ‘ఏదో జరిగే.. మునుపెరుగని మాయే జరిగినది.. ఏంటో తెలిసే, ఏంటో తెలిసే.. నీపైన ప్రేమ తెలిసింది’ అంటూ సాగే పాటలో రవి, విషిక జంట ఆకట్టుకుంది.  

జశ్వంత్ పసుపులేటి కంపోజ్ చేసిన పాటకు పవన్ కుందని, రాజశేఖర్ సుద్మూన్ లిరిక్స్ రాశారు. కీర్తన శేష్, కనకవ్వ పాడిన తీరు బాగుంది. విలేజ్ బ్యాక్‌‌డ్రాప్‌‌లో ఈ చిత్రాన్ని రూపొందించారు.