ఎల్​ఐసీ నుంచి మరో మ్యూచువల్ ఫండ్

ఎల్​ఐసీ నుంచి మరో మ్యూచువల్ ఫండ్

హైదరాబాద్​, వెలుగు : ఎల్​ఐసీ మ్యూచువల్ ఫండ్ అసెట్ మేనేజ్‌‌మెంట్ లిమిటెడ్ కొత్త ఫండ్ ఆఫర్ (ఎన్​ఎఫ్​ఓ) ‘ఎల్​ఐసీ ఎంఎఫ్​ నిఫ్టీ మిడ్‌‌క్యాప్ 100 ఈటీఎఫ్​’ని ప్రారంభించినట్లు ప్రకటించింది. ఈ ఎన్​ఎఫ్​ఓ ఈ నెల 8న  ప్రారంభమయింది. ఇదే నెల 12న ముగుస్తుంది. ఈ పథకంలో 19 ఫిబ్రవరి నుంచి తిరిగి ఇన్వెస్ట్​మెంట్ చేయవచ్చు. 

పథకాన్ని నిఫ్టీ మిడ్‌‌క్యాప్ 100 టోటల్ రిటర్న్ ఇండెక్స్‌‌తో పోల్చిచూస్తారు. నిఫ్టీ మిడ్‌‌క్యాప్ 100 టోటల్ రిటర్న్ ఇండెక్స్​లోని సెక్యూరిటీల మొత్తం రాబడికి సమానంగా రాబడిని అందించడం ఈ పథకం లక్ష్యం.  ఎన్​ఎఫ్​ఓలో కనీస పెట్టుబడి రూ. 5000.