డెల్టా ప్లస్ వైరస్ తో మరో వ్యక్తి  మృతి

డెల్టా ప్లస్ వైరస్ తో మరో వ్యక్తి  మృతి

డెల్టా నుంచి బయటపడక ముందే ఇండియాకు డెల్టా ప్లస్ రూపంలో మరో ముప్పు వచ్చి పడింది. డెల్టా ప్లస్ వేరియంట్ తో మరో వ్యక్తి  చనిపోయాడు. మధ్యప్రదేశ్ లోనే తొలి మరణం నమోదు కాగా.. రెండో మరణం కూడా అక్కడే నమోదైంది. మధ్యప్రదేశ్ లో మొత్తం ఏడుగురికి  డెల్టా ప్లస్ వైరస్ సోకినట్లు గుర్తించారు అధికారులు. ఇందులో ఇద్దరు చనిపోయారు. ఐదుగురు కోలుకున్నారు. ఏడుగురు  పేషంట్లకు కూడా  గత నెలలోనే  డెల్టా ప్లస్  వైరస్ సోకింది. వీరి శాంపిళ్లను  జినోమ్ టెస్టింగ్ కు  పంపడంతో వారు డెల్టా ప్లస్ వైరస్ తోనే  చనిపోయారని తేలింది. మధ్యప్రదేశ్ లోని  7 డెల్టా ప్లస్  కేసుల్లో  ఇద్దరు చనిపోగా... ఐదుగురు కోలుకున్నారు. కోలుకున్నవాళ్లలో రెండేళ్ల  చిన్నారి  కూడా ఉంది. చనిపోయిన  ఇద్దరు కూడా  వ్యాక్సిన్  వేసుకోలేదని చెప్పారు  అధికారులు. కోలుకున్న  ఐదుగురిలోనూ  ముగ్గురే  టీకా వేసుకున్నట్లు  చెప్పారు. ఈ ముగ్గురు  మైల్ట్ సింటమ్స్ తో  హోం ఐసోలేషన్ లోనే  ఉండి  కరోనా నుంచి  బయటపడినట్లు  తెలిపారు అధికారులు.