"లైగర్"నుంచి మరో రొమాంటిక్ సాంగ్ విడుదల

"లైగర్"నుంచి మరో రొమాంటిక్ సాంగ్ విడుదల

అర్జున్ రెడ్డి హీరో విజయ్ దేవరకొండ  ప్రధాన పాత్రలో ఇటీవల తెరకెక్కిన చిత్రం లైగర్. డైరెక్టర్ పూరి జగన్నాథ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంపై ఇప్పటికే భారీగానే అంచనాలు నెలకొన్నాయి. తాజాగా ఈ సినిమా నుంచి మరో రొమాంటిక్ సాంగ్ విడుదలైంది. "అఫత్" అనే సాంగ్ ను మూవీ మేకర్స్ రిలీజ్ చేయగా... ఇందులో విజయ్ మరింత మాస్ లుక్ లో కనిపించాడు. ఈ పాట ప్రస్తుతం కుర్రకారును విపరీతంగా ఆకట్టుకుంటోంది. ఈ సాంగ్ లో విజయ్, అనన్యలు మరింత రొమాంటిక్‏గా కనిపిస్తున్నారు. అలాగే లిరిక్స్ సైతం ఆకట్టుకుంటున్నాయి. 

ఇప్పటికే లైగర్ సినిమాకు సంబంధించి "అక్డీ పక్డీ" సాంగ్ అనే సాంగ్ రిలీజ్ కాగా.. ఇది ప్రస్తుతం యూట్యూబ్ ను షేక్ చేస్తున్న సంగతి తెలిసిందే. కాగా పాన్ ఇండియా రేంజ్ లో తెరకెక్కిన ఈ మూవీ ఆగష్టు 25న విడుదల కానుంది. బాక్సింగ్ నేపథ్యంలో రాబోతున్న ఈ మూవీలో విజయ్ బాక్సర్ గా కనిపించనున్నాడు. ఇందులో రమ్యకృష్ణ, మైక్ టైసన్ కీలకపాత్రలలో నటిస్తున్నారు.