ఆగని చావులు.. రెండు నెలల్లోనే అమెరికాలో.. ఒకే గ్రామానికి చెందిన ఇద్దు మృతి

ఆగని చావులు.. రెండు నెలల్లోనే అమెరికాలో.. ఒకే గ్రామానికి చెందిన ఇద్దు మృతి

అమెరికాలో మరో తెలుగు విద్యార్థి మృతి చెందాడు. ఆంధ్రప్రదేశ్ లోని గోపాలపురం మండలం చిట్యాల గ్రామానికి చెందినగద్దె శ్రీనివాసరావు కుమారుడు సూర్య అవినాష్ శశి బీటెక్ పూర్తి చేసి మాస్టర్స్ కోసం అమెరికా వెళ్లాడు. అమెరికా లోని న్యూ జెర్సీలో ఉంటూ విద్యను అభ్యసిస్తున్నాడు. ఈ క్రమంలోనే సోమవారం ఉదయం తన సన్నిహితులతో కలిసి వాటర్ ఫాల్స్ చూడడానికి వెళ్ళగా కాలుజారి కింద పడి మృతి చెందాడని తన స్నేహితులు తెలిపారు. 

ఇదిలా ఉంటే చిట్యాల గ్రామంలోనే రెండు నెలల్లో ఇద్దరు విద్యార్థులు అమెరికాలో మృతి చెందడంతో గ్రామంలో విషాద ఛాయలు కమ్ముకున్నాయి.  అమెరికాలోని తానా అసోసియేషన్ వారి సహకారంతో మృతదేహాన్ని ఇండియాకు తీసుకు వచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నామని తాన అధ్యక్షులు తెలిపారు.