సినీ పరిశ్రమలో మరో విషాదం.. జూనియర్ బాలయ్య మృతి

సినీ పరిశ్రమలో మరో విషాదం.. జూనియర్ బాలయ్య మృతి

వరుసగా చిత్ర పరిశ్రమల్లో విషాద ఛాయలు అలుముకుంటున్నాయి. అక్టోబర్ 28న హాలీవుడ్ యాక్టర్ మాథ్యూ పెర్రీ, నవంబర్ 1న మలయాళ నటి డాక్టర్ ప్రియ..ఇవాళ (నవంబర్ 2న) కోలీవుడ్ నటుడు టీఎస్ బాలయ్య కొడుకు జూనియర్ బాలయ్య (Junior Balayya). 

వివరాల్లోకి వెళ్తే.. తమిళ సీనియర్ నటుడు జూనియర్ బాలయ్య (70) మరణించారు. ఇవాళ గురువారం ఆయన చెన్నై లో తుది శ్వాస విడిచారు. జూనియర్ బాలయ్య శ్వాస సంబంధిత వ్యాధితో బాధపడుతూ కన్నుమూశారు. దీంతో తమిళ చిత్ర పరిశ్రమలో విషాద ఛాయలు నెలకొన్నాయి. ఆయన మృతికి పలు సినీ పరిశ్రమకు చెందిన ప్రముఖులు నివాళులర్పిస్తున్నారు. ఆయన తమిళ చిత్ర పరిశ్రమలో సీనియర్ న‌టుడు అయిన టీఎస్ బాలయ్య వారసుడిగా గుర్తింపు పొందారు.

జూనియర్ బాలయ్య సినీ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన మూడు రోజుల్లోనే..తండ్రి టీఎస్ బాలయ్య మరణించడంతో..జూనియర్ బాలయ్య కెరీర్ మరి ఆశించినంత స్థాయిలో సాగలేదు.ఈయన తమిళంలో 'మేల్నాట్టు మరుమగ' సినిమాతో అరంగేట్రం చేశాడు.

ఆయన నటుడిగా కొన్ని సినిమాలు చేసినప్పటికీ..తన తండ్రి స్థాయిని చేరుకోవడంలో విఫలమయ్యాడు. అత‌ను చివ‌ర‌గా నటించిన చిత్రం దళపతి విజ‌య్ పులి, అజిత్ నేర‌కోండా పార్వై లాంటి మూవీస్ లో నటించాడు. 

ALSO READ :- యాపిల్ చైనా కంటే ముందే భారత్లో ఐఫోన్ 17 తయారీ