టోక్యోకు ఆస్ట్రేలియా ప్రధాన మంత్రి

 టోక్యోకు ఆస్ట్రేలియా ప్రధాన మంత్రి

ఆస్ట్రేలియా నూతన ప్రధాన మంత్రి ఆంటోనీ అల్బనీస్ (Anthony Albanese) ప్రమాణ స్వీకారం చేశారు. 2022, మే 23వ తేదీ సోమవారం ఉదయం కాన్ బెర్రాలో ప్రమాణ స్వీకార కార్యక్రమం జరిగింది. హంగు, ఆర్భాటాలు లేకుండా ఈ కార్యక్రమం జరగడం విశేషం. విదేశాంగ మంత్రి పెన్నీ వాంగ్, ఆర్థిక మంత్రి కాటీ గల్లాఘర్ బాధ్యతలు స్వీకరించారు. ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత.. జపాన్ ఫ్లైట్ ఎక్కారు ఆంటోనీ. జపాన్ లోని టోక్యోలో క్వాడ్ సదస్సు జరుగుతున్న సంగతి తెలిసిందే.  ఈ సదస్సులో ఆయన పాల్గొననున్నారు. భారత ప్రధాని నరేంద్ర మోడీ, అమెరికా అధ్యక్షులు అధ్యక్షులు జో బైడెన్, జపాన్ ప్రధాని కిషిదిలను తాను స్వయంగా కలుస్తానని ప్రధాన మంత్రిగా ఎన్నికైన అనంతరం ఆయన వెల్లడించిన సంగతి తెలిసిందే. వాతవరణ మార్పులపై చర్చించేందుకు ఆస్ట్రేలియా సిద్ధంగా ఉందని ఆయన ప్రకటించారు.

ఆస్ట్రేలియా పార్లమెంట్ స్థానానికి ఇటీవలే ఎన్నికలు జరిగాయి. మొత్తం 151 స్థానాలకు ఎన్నికలు జరిగాయి. 72 స్థానాల్లో విపక్ష లేబర్ పార్టీ స్థానాల్లో విజయం సాధించగా.. మారిసన్ పార్టీ కేవలం 51 స్థానాలకే పరిమతమైంది. దీంతో ఆస్ట్రేలియా 31వ ప్రధానిగా అల్బనీస్ ఆంటోనీ ఎన్నికయ్యారు. ఏడుగురు ఇండిపెండెంట్లు గెలుపొందారు. ప్రధాన మంత్రి స్కాట్ మోరిసన్ తన ఓటమిని అంగీకరించి...నూతన ప్రధానికి శుభాకాంక్షలు తెలిపారు. 2007 తర్వాత లేబర్ పార్టీ అధికారంలోకి రావడం ఇదే మొదటిసారి కావడం గమనార్హం. నూతన ప్రధానిగా ఎన్నికైన అల్బనీస్ కు ప్రధాన మంత్రి నరేంద్ర మోడీతో పాటు ఇతర దేశాధినేతలు అభినందనలు తెలిపారు. 

మరిన్ని వార్తల కోసం :-

పేపర్ రాకెట్‌‌తో గిన్నీస్ రికార్డు సృష్టించాడు.. వీడియో


లజోవా సిటీలో 1000 అపార్ట్ మెంట్లు ధ్వంసం