దేశద్రోహులను విడిపించేందుకు కుట్ర

దేశద్రోహులను విడిపించేందుకు కుట్ర

న్యూఢిల్లీ: కొత్త వ్యవసాయ చట్టాలను వ్యతిరేకిస్తూ దేశ రాజధాని ఢిల్లీలో రైతులు చేపట్టిన నిరసనలు 19వ రోజుకు చేరాయి. కేంద్ర ప్రభుత్వం అన్నదాతలతో పలు దఫాలుగా చర్చలు జరిపినప్పటికీ అవి సఫలం కాలేదు. ఈ విషయాన్ని పక్కనబెడితే.. రైతుల నిరసనల్లో దేశ వ్యతిరేక శక్తులు, లెఫ్టిస్టులు, మావోయిస్టు వింగ్ గ్యాంగ్ చొరబడిందని కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ అన్నారు. ఈ నిరసనల్లో మోడీ వ్యతిరేక అంశాలు, విద్రోహ శక్తులు యాక్టివ్‌‌గా పాలుపంచుకుంటున్నాయని తోమర్ చెప్పారు.

‘కేంద్ర ప్రభుత్వం చర్చలను విజయవంతంగా ఆరంభించింది. కానీ రైతు సంఘాలు ఏకగ్రీవ నిర్ణయానికి రాలేకపోతున్నాయి. గత రెండ్రోజులుగా వస్తున్న వార్తలు ఆశ్చర్యకరంగా ఉన్నాయి. లెఫ్ట్ సిద్ధాంతాలను నమ్మే వాళ్లు ఈ నిరసనలను ప్రభావితం చేస్తున్నారు. దేశద్రోహులను విడిపించేందుకు యత్నిస్తున్నారు. దీన్ని ఖండించాల్సిందే. ఇలా చేస్తోంది రైతులు కాదు. మోడీకి వ్యతిరేకంగా ఉన్న వారే దీనికి కారకులు’ అని తోమర్ పేర్కొన్నారు.