క్యాస్టింగ్​ కౌచ్​పై అను కామెంట్స్​ వైరల్​

క్యాస్టింగ్​ కౌచ్​పై అను కామెంట్స్​ వైరల్​

హీరోయిన్​ అనూ ఇమ్మాన్యూయేల్(Anu Emmanuel) ​ సంచలన ఆరోపణలు చేసింది. తాను కూడా క్యాస్టింగ్​ కౌచ్​ బాధితురాలినేని తెలిపింది. అవకాశాల కోసం వెళితే కొందరు తనను అడ్వాంటేజ్​ తీసుకునేందకు ట్రై చేసేవారని తాజాగా ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది. వారి కోరికలు తీర్చితే చాన్స్​లు వస్తాయని చెప్పేవారంది. అలాంటి టైంలో తన కుటుంబమే తనకు అండగా నిలిచిందని అను తెలిపింది. 

హీరో నానితో మజ్నూ సినిమాతో ఈ హీరోయిన్​ టాలీవుడ్​కి పరిచయమైన సంగతి తెలిసిందే.  పవన్ కళ్యాణ్ కి జంటగా అజ్ఞాతవాసి, అల్లు అర్జున్ తో నా పేరు సూర్య, నాగ చైతన్యతో  శైలెజా రెడ్డి అల్లుడు వంటి సినిమాలు చేసినా పెద్దగా సక్సెస్​ కాలేకపోయింది.ఈ మూవీస్ వరసగా డిజాస్టర్ కావడంతో అను స్టార్ హీరోయిన్ అయ్యే ఛాన్స్ కోల్పోయింది. 

ఇటీవల రావణాసుర చిత్రంతో పలకరించింది. అది కూడా నిరాశపరిచింది. ప్రసెంట్ హీరో కార్తీకి జంటగా జపాన్ చిత్రంలో అను ఇమ్మానియేల్ నటిస్తున్నారు.ఈ మూవీ సెప్టెంబర్ 30న విడుదల కానుంది. ఈ క్రమంలో అను ఇమ్మాన్యూయేల్ మూవీ ప్రమోషన్స్ లో పాల్గొంటుంది. ఈ సందర్భంగా ఆమె క్యాస్టింగ్ కౌచ్ పై మాట్లాడారు.