వైరల్ వీడియో: పెళ్లికి ముందే గర్భం వస్తే ఎలా..?

 వైరల్ వీడియో: పెళ్లికి ముందే గర్భం వస్తే ఎలా..?
  • బాలీవుడ్ దర్శకుడికి కుమార్తె ప్రశ్న
  • ఫాదర్స్ డే  స్పెషల్: తండ్రీ కుమార్తెల ఓపెన్ టాక్ ఇంటర్వ్యూ వీడియో యూట్యూబ్ లో విడుదల
  • వైరల్ అవుతున్న అనురాగ్-ఆలియా కశ్యప్ ల వీడియో 

భారతదేశంలో సెలబ్రిటీల కుటుంబాల్లో స్వేచ్ఛకు హద్దులు లేవు. తండ్రికి కొడుకైనా.. కూతురైనా ఒకటే. అలాగే వారి పిల్లలకు కూడా తండ్రయినా.. సోదరుడైనా.. స్నేహితుడైనా, స్నేహితురాలైనా ఒక్కటే. ఎలాంటి దాపరికాలు లేవు. ఏ విషయంలోనూ దాపరికాలు లేకుండా ఓపెన్ గా మాట్లాడుకుంటారు. నచ్చిన వారితో స్వేచ్ఛగా కలిసిపోతారు. కులమతాలు, దేశం వంటి భేదాలు అస్సలుండవు. తరం మారింది అని సరిపెట్టుకుంటున్న తల్లిదండ్రులు కూడా తమ పిల్లలకు నచ్చింది చేయనిస్తున్నారే తప్ప నో చెప్పడం లేదు. వారి సందేహాలు తీర్చే గైడ్ గా వ్యవహరిస్తున్నారే తప్ప అది చెయ్.. ఇది చెయ్ అని చెప్పడం లేదు. ఒక వేళ అలా చెప్పాల్సి వస్తే సందేహిస్తున్నారే తప్ప బలవంతం అస్సలు చేయడం లేదు. 
సెలబ్రిటీలు ముఖ్యంగా చిత్రపరిశ్రమకు చెందిన వారి కుటుంబాల్లో డబ్బుకు కొదవలేదు. భవిష్యత్తుపై బెంగ ఉండదు కాబట్టి నచ్చిన పని చేసేందుకు వెనుకాడడం లేదు. తల్లిదండ్రులు కూడా తరం మారింది మనం కాదంటే ఆగే పరిస్థితి లేదని సరిపెట్టుకుంటున్నారు. పిల్లలు ఏ తప్పు చేసినా గుండెల్లో దాచుకుంటున్నారు. ఒక వేళ చేయకూడని.. తప్పులు చేసినా భరిస్తూ.. వారు మరిన్ని తప్పులు చేయకుండా సలహాలిస్తూ వస్తున్నారు. దీనికి తాజా నిదర్శనం బాలీవుడ్ దర్శకుడు అనురాగ్ ఆయన కుమార్తె ఆలియా కశ్యప్ ల ముఖాముఖి ఇంటర్వ్యూ వీడియో. నిన్న ఫాదర్స్ డే సందర్భంగా యూట్యూబ్ లో విడుదల చేసిన ఈ వీడియో వైరల్ అవుతోంది. కశ్యప్ కుటుంబంలో జరుగుతున్న విషయాలన్ని ఓపెన్ చేస్తూ విడుదల చేసిన వీడియో ఆధునికతరం స్వేఛ్ఛ ఎలా ఉందో స్పష్టం చేస్తుంది. మున్ముందు మన మధ్య తరగతి కుటుంబంలోకి కూడా ఈ ట్రెండ్ వచ్చి చేరినా ఆశ్చర్యపోనవసరం లేదు. పిల్లలు వంటకు.. పనికి అడ్డం వస్తున్నారని చేతిలో మొబైల్ ఇచ్చి ఆడుకోనిస్తే వారు మొబైల్ కు బానిసలుగా మారి.. స్వేచ్ఛకు అలవాటుపడి ఎలా తయారవుతారోననే దానికి ఓ నిదర్శనంలా నిలుస్తుందని నెటిజనులు కోడై కూస్తున్నారు. ఇంతకూ ఈ వీడియోలో అంతగా ఏముందని అనుమానం వస్తుంది కదూ.. అంటే ఏమీ లేదు ఫాదర్స్ డే సందర్భంగా నేటితరం తండ్రులు ఎలా ఉంటారో తెలియజేసే ప్రయత్నం పేరుతో అలియా కశ్యప్.. తన తండ్రి బాలీవుడ్ దర్శకుడిని సరదాగా.. ఇంటర్వ్యూ చేస్తుంది. ఓస్ ఇంటర్వ్యూనే అనుకునేరు.. ఆమె సంధించిన ప్రశ్నలు.. వింటే దిమ్మతిరుగుతుంది. అంతేకాదు.. ఆమె తన తండ్రిని ఏ మాత్రం పట్టించుకోకుండా బాయ్ ఫ్రెండ్ గ్లెగోయిర్ (విదేశీయుడు) తో బలాదూర్ తిరుగుతోంది. తిరగడమే అనుకుంటే కాదు.. ఏకంగా తన ఇంటికే తెచ్చుకుని సహజీవనం చేస్తోంది. తన కుమార్తె బాయ్ ఫ్రెండ్ తో సహజీవనం చేస్తున్నా దర్శకుడు అనురాగ్ ఏమాత్రం అభ్యంతరం చెప్పలేదు. సరికదా వారితో సరదాగా కలసి గడుపుతున్నాడు. నీకు నచ్చాడు అంటే అతనిలో ఏదో ఆకట్టుకునే గుణం ఉండే ఉంటుందని కూతురుకు వత్తాసు పలకుతున్నాడు. తన కుమార్తె , ఆమె బాయ్ ఫ్రెండ్ తో కలసి ఒకే కారులో ముగ్గరు బయట రెస్టారెంట్లకు వెళ్లి రావడంతో వీడియోలో ఇంటర్వ్యూ మొదలవుతుంది. తన ఇంట్లో తండ్రి పక్కనే సోఫాలో కూర్చుని సరదాగా అన్ని ప్రశ్నలు సంధిస్తుంది. పెళ్లికి ముందు బాయ్ ఫ్రెండ్ తో అర్ధరాత్రిపూట బయట తిరిగితే తప్పు కదా వంటి ప్రశ్నలు మొదలు.. పెళ్లికి ముందే గర్భం వస్తే ఎలా.. వంటి ప్రశ్నలు సంధిస్తుంది. దానికి ఆయన సున్నితంగానే సమాధానాలిస్తారు. శృంగారం గురించి మాట్లాడితే.. దానిలో రహస్యమేముంది..? ఈడొచ్చిన వారిలో కోరికలు కలగడం సహజం.. కాకపోతే గర్భం రాకుండా చూసుకోవాలి.. ఒకవేళ వచ్చిందంటే.. దానికి మూల్యం మీరే భరించుకోవాల్సి ఉంటుందని సున్నితంగానే హెచ్చరించాడు. ఇంత ఓపెన్ గా.. సాగడం వల్లే ఈ ఇంటర్య్యూ వైరల్ అవుతోంది. కావాలంటే మీరు ఈ కింది లింక్ ఓపెన్ చేసి చూడండి..