భారత్ పాక్‌లో పర్యటించాలంటే అలా జరగాలి: అనురాగ్ ఠాకూర్

భారత్ పాక్‌లో పర్యటించాలంటే అలా జరగాలి: అనురాగ్ ఠాకూర్

భారత క్రికెట్ జట్టు పాకిస్థాన్ లో పర్యటించి 16 ఏళ్ళు కావొస్తుంది. చివరిసారిగా 2008లో భారత్ పాక్ లో పర్యటించింది. ఉగ్రవాదదాడి కారణంగా పాక్ దేశానికి వెళ్లి క్రికెట్ వెళ్లి ఆడటం మానేశారు. దీంతో 2008 లో కూడా పాక్ ప్లేయర్లను ఐపీఎల్ ఆడకుండా నిషేధించారు. అప్పటినుంచి ఇరు జట్లు ఐసీసీ టోర్నీల్లో మాత్రమే తలబడుతున్నాయి.

భారత క్రికెట్ నియంత్రణా మండలి(బీసీసీఐ).. దాయాది పాకిస్తాన్ క్రికెట్ బోర్డు(పీసీబీ)కు కంటి మీద కునుకులేకుండా చేస్తోంది. ఇప్పటివరకూ ద్వైపాక్షిక సిరీస్‌లకు నో చెప్పిన బీసీసీఐ.. ఇప్పుడు పాక్ గడ్డపై జరిగే ఐసీసీ టోర్నీల్లోనూ ఆడేందుకు ససేమిరా అంటోంది. దీంతో దాయాది క్రికెట్ బోర్డుకు ఏం చేయాలో పాలుపోవడం లేదు. దీంతో భారత్ పాక్ లో ఎప్పుడు పర్యటిస్తుందనే సస్పెన్స్ ఇంకా కొనసాగుతూనే ఉంది. తాజాగా ఈ ప్రశ్న భారత క్రీడల మంత్రి అనురాగ్ ఠాకూర్ కు పాక్ లో క్రికెట్ ఆడటానికి భారత క్రికెట్ జట్టు ఎప్పుడు అనే ప్రశ్న ఎదురైంది. 

ఛాంపియన్స్ ట్రోఫీ 2025 సమీపిస్తున్న తరుణంలో భారత జట్టు పాకిస్థాన్‌ను సందర్శించడంపై మళ్లీ ప్రశ్న తలెత్తింది. దీనిపై అనురాగ్ ఠాకూర్ గట్టి సమాధానమే ఇచ్చాడు. "ఈ విషయాన్ని బీసీసీఐ నిర్ణయించాల్సి ఉంది. ముందు భారత్‌పై కాల్పులు ఆపాలి. మాపై బాంబులు విసరడం మానేయాలి. ఉగ్రవాదాన్ని ఆపాలి. ఎప్పుడైతే పాకిస్థాన్ ఉగ్రవాద కార్యకలాపాలను ఆపుతుందో అప్పుడు భారత్ పాకిస్థాన్ వెళ్లి క్రికెట్ ఆడుతుంది. ఇది నా వ్యక్తిగత అభిప్రాయం. " అని ఠాకూర్ అన్నారు.    

పాక్ వేదికగా ఛాంపియన్స్‌ ట్రోఫీ

ఐసీసీ షెడ్యూల్ ప్రకారం.. పాకిస్తాన్ వేదికగా 2025 ఛాంపియన్స్‌ ట్రోఫీ జరగాల్సి ఉంది. ఇప్పటికే దీనిపై ఐసీసీ స్పష్టతనిచ్చింది. పాకిస్తాన్‌‌లోనే ఈ టోర్నీ నిర్వహిస్తామని తేల్చి చెప్పింది. అయితే, బీసీసీఐ మాత్రం పాక్ ‌లో పర్యటించేది లేదని తెగేసి చెప్తోంది. సరిహద్దు సమస్యలు ఓ కొలిక్కి వచ్చేవరకూ దాయాది దేశానికి వెళ్లేది లేదని ఖరాకండిగా చెప్తోంది. దీంతో దాయాది క్రికెట్ బోర్డు ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషిస్తోంది. భారత జట్టు లేకపోతే టోర్నీ కళ తప్పడమే కాకుండా, లాభాలలో భారీగా గండి పడే అవకాశం ఉండటంతో ప్రత్యామ్నాయ ఏర్పాట్ల వైపు దృష్టి పెట్టింది.