ఢిల్లీలో ఎవ్వరినైనా అరెస్టు చేయొచ్చు

ఢిల్లీలో ఎవ్వరినైనా అరెస్టు చేయొచ్చు
  • పోలీసులకు ఎల్జీ అనుమతి

న్యూఢిల్లీ: ఢిల్లీలో ఏ వ్యక్తినైనా అదుపులోకి తీసుకునేందుకు పోలీస్ కమిషనర్ కు లెఫ్టినెంట్ గవర్నర్ అనిల్ బైజల్ అనుమతినిస్తూ ఆదేశాలిచ్చారు. ‘నేషనల్ సెక్యూరిటీ యాక్ట్​కింద దేశ రాజధాని ఢిల్లీలో ఎవ్వరినైనా అదుపులోకి తీసుకునే అధికారాన్ని పోలీస్ కమిషనర్ కు అక్టోబర్ 18 వరకు ఇస్తున్నాం..’ అని ఆ నోటిఫికేషన్ లో పేర్కొన్నారు. ఇండిపెండెన్స్ డే వేడుకల సందర్భంగా ఇలా నోటిఫికేషన్ ఇవ్వడం సాధారణమే.. అయితే 2020 జనవరిలో సీఏఏకు వ్యతిరేకంగా నిరసనలు జరిగినప్పుడు కూడా పోలీసులకు ఇలాంటి అధికారాలిచ్చారు. ఇప్పుడు అగ్రి చట్టాలకు వ్యతిరేకంగా ఆందోళనలు జరుగుతున్నందున ఈ నోటిఫికేషన్ ఇచ్చినట్లు తెలుస్తోంది.