ఏపీలో పెన్షన్ రూ.2 వేలు.. చంద్రబాబు ప్రకటన

ఏపీలో పెన్షన్ రూ.2 వేలు.. చంద్రబాబు ప్రకటన

ఏపీలో వృద్ధులు, వితంతువులకు ఇచ్చే పెన్షన్లు డబుల్ అయ్యాయి. ఇప్పటి వరకు వెయ్యి రూపాయలు అందుకున్న వాళ్లు ఇక రూ.2 వేలు తీసుకోబోతున్నారు. ఈ నిర్ణయాన్ని నెల్లూరు జిల్లా పర్యటనలో  ఏపీ సీఎం చంద్రబాబు ప్రకటించారు. రాష్ట్ర ప్రజలకు ఇదే తన సంక్రాంతి కానుక అని చెప్పారు. జనవరి నుంచే ఈ నిర్ణయాన్ని అమలు చేస్తామన్నారు. అయితే ఈ నెలలో ఇప్పటికే రూ. వెయ్యి చొప్పున ఫించన్లు ఇచ్చేసినందున మిగతా వెయ్యిని ఫిబ్రవరిలో కలిపి ఇస్తామని తెలిపారు. అంటే ఫిబ్రవరిలో వృద్ధులు, వితంతువులు మొత్తం 3 వేల రూపాయలు పింఛన్ గా అందుకుంటారు. మార్చి నుంచి రూ.2 వేలు చేతికందుతుంది. 2019 ఎన్నికల ముందు ఈ నిర్ణయం తీసుకోవడం టీడీపీకి ప్లస్ అవుతుందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.