2029 లో కడప లో 10 కి10 సీట్లు గెలవాలి.. మహానాడులో సీఎం చంద్రబాబు

2029 లో కడప లో 10 కి10 సీట్లు గెలవాలి.. మహానాడులో సీఎం చంద్రబాబు

కడపలో మహానాడు నిర్వహిస్తే విజయవంతం అవుతుందో లేదోనని చాలా మంది అనుమానించారని.. కానీ సభకు వచ్చిన అందరినీ చూస్తే ధైర్యం వచ్చిందని సీఎం చంద్రబాబు అన్నారు. ఇప్పటి వరకు చాలా మహానాడులు చూసామని.. కానీ కడప మహానాడు ప్రత్యేకం అని అన్నారు. కార్యకర్తలు గత రెండు రోజుల నుంచి చివరి వరకు కూర్చుని కడప టీడీపీ అడ్డా అని నిరూపించారని అన్నారు. ఇదే స్ఫూర్తితో  2029 లో కడప లో 10 కి10 సీట్లు గెలవాలని పిలుపునిచ్చారు.

కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక మొదటి మహానాడు దేవుని గడప లో జరిగిందని.. కార్యకర్తలు, ప్రజల రుణం  తీర్చుకుంటానని మహానాడులో సీఎం చెప్పారు. గత ఎన్నికల్లో రాయలసీమ ప్రజలు అద్భుతమైన తీర్పు  ఇచ్చారని.. అహంకారంతో విర్రవేగేవారికి  మంచి గుణపాఠం చెప్పారని అన్నారు. ఈ తీర్పు ను మనం అర్థం చేసుకున్నాము.. కానీ ఓడిపోయిన పార్టీ ఇంకా అర్థం చేసుకోలేదు...

Also Read : డిప్యూటీ CM పవన్ కళ్యాణ్ ఆదేశాలు

ఇక ముందు కూడా అర్థం చేసుకోరు అని ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు వ్యాఖ్యలు:

అధికారం కోసం పుట్టిన పార్టీ కాదు టీడీపీ
గత ప్రభుత్వంలో కేంద్ర పథకాలు నిధులు డైవర్ట్ చేశారు
అధికారంలోకి వచ్చిన వెంటనే పథకాలను పునరుద్ధరించాను
అన్న క్యాంటీన్లు తెరవడం, రోడ్లు బాగుచేయడం, పెన్షన్లు రూ.4 వేలు చేయడం, దేవాలయాల్లో అన్నదానం ప్రారంభించాం
తెలుగుదేశం అంటేనే బీసీల పార్టీ
బీసీల కోసం బడ్జెట్ లో రూ.47 వేల కోట్లు కేటాయించాం
సూర్యఘర్ పథకం కింద SC, ST లకు ఫ్రీ గా సోలార్ విద్యుత్ ఇస్తాం
రైతులకు వ్యవసాయ పంపు సెట్ల వద్ద సోలార్ విద్యుత్ పెట్టుకోవాలి
ఉద్యోగులను గత ప్రభుత్వం అవమానాలకు గురి చేసింది
కానీ ఒకటవ తేదీన జీతాలు ఇస్తున్నాము
వారికి ఇప్పుటికే రూ.7 వేల 500 కోట్లు బకాయిలు ఇచ్చాం
కూటమి రాగానే ల్యాండ్ టైట్లింగ్ చట్టం రద్దు చేశాం
రాబోయే మహానాడుకు భూ సమస్యలు లేకుండా చేస్తాను
దేశానికి టెర్రరిస్ట్ ల వలన చాలా నష్టం
మన దేశంలో, రాష్ట్రంలో ఆర్థిక ఉగ్రవాదుల వలన నష్టం కలుగుతుంది
నాసిరకం మద్యం వలన ఆరోగ్య సమస్యలు తలెత్తాయి
గంజాయ్ వలన అనేక మంది భవిష్యత్ నాశనం అయింది
అడవులను ఆక్రమించుకుని ఎస్టేట్ లు కడుతారు
ఆర్థిక ఉగ్రవాదులు గుండెల్లో రైళ్లు పరిగెత్తిస్తాను
డ్రగ్స్ అమ్మే వారికి అదే చివరి రోజు అవుతుంది
ఇక్కడ ఉంది CBN అని గుర్తు పెట్టుకోండి అని 
యువత భవిష్యత్తు కోసమే కూటమి ప్రభుత్వం పని చేస్తుంది
యువతే నా బలం, యువత మీదే నా ఆశలు.. I am with youth 
గత పరిపాలనా భూతానికి పారిశ్రామికవేత్తలు  వెనకడుగు వేశారు
విధ్వంస భూతాన్ని శాశ్వతంగా భూస్థాపితం చేస్తామన్న హామీతో పరిశ్రమలు మళ్లీ రాష్ట్రానికి క్యూ కడుతున్నాయి
రాష్ట్రాన్ని గ్లోబల్ హబ్ గా తీర్చిదిద్దుతాం
రాష్ట్రంలో ఎవరు డ్రగ్స్, గంజాయి అమ్మినా, ఆడబిడ్డల్ని వేధించినా అదే వారికి చివరి రోజు