టాలీవుడ్ హీరో నారా రోహిత్ ఓ ఇంటివాడయ్యారు. హీరోయిన్ శిరీష లేళ్ల (సిరి)తో మూడుముళ్ల బంధంతో వివాహ బంధంలో అడుగుపెట్టారు. గురువారం (2025 అక్టోబర్ 30న) రాత్రి 10.35 గంటలకు హైదరాబాద్‌లో వీరి వివాహం ఘనంగా జరిగింది. ఈ నారావారి అబ్బాయి పెళ్లివేడుకకు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు, భువనేశ్వరి దంపతులతో పాటు సినీ, రాజకీయ ప్రముఖులు పెద్ద సంఖ్యలో హాజరై, వధూవరులను ఆశీర్వదించారు.
ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు పెళ్లి వేడుక ఫోటోలు షేర్ చేస్తూ తమ ఆనందాన్ని పంచుకున్నారు. ‘‘మా ఇంటి పెళ్లి సందడి.. నా సోదరుడు దివంగత నారా రామ్మూర్తి నాయుడు దివ్య ఆశీస్సులతో తనయుడు నారా రోహిత్, శిరీషల వివాహ వేడుకను అంగరంగ వైభవంగా చేశాం. నూతన వధూవరులకు అక్షింతలు వేసి ఆశీస్సులు అందజేశాం. మా రోహిత్ ఒక ఇంటివాడు అవుతున్న శుభ సందర్భం మా కుటుంబానికి ఒక పండుగ. మా నారావారి ఆహ్వానం మన్నించి పెళ్లికి విచ్చేసి కొత్త జంటకు శుభాకాంక్షలు తెలియజేసిన అందరికీ ధన్యవాదాలు’’ అని సీఎం తెలిపారు.
మా ఇంటి పెళ్లి సందడి.. నా సోదరుడు దివంగత నారా రామ్మూర్తి నాయుడు దివ్య ఆశీస్సులతో తనయుడు నారా రోహిత్, శిరీషల వివాహ వేడుకను అంగరంగ వైభవంగా చేశాం. నూతన వధూవరులకు అక్షింతలు వేసి ఆశీస్సులు అందజేశాం. మా రోహిత్ ఒక ఇంటివాడు అవుతున్న శుభ సందర్భం మా కుటుంబానికి ఒక పండుగ. మా నారావారి… pic.twitter.com/Tq3nVXtsmO
— N Chandrababu Naidu (@ncbn) October 30, 2025
అక్టోబర్ 25న హల్దీ వేడుకతో పెళ్లి సంబరాలు మొదయ్యాయి. అక్టోబర్ 26న సంప్రదాయబద్ధంగా పెళ్లికొడుకు కార్యక్రమం జరగింది. అక్టోబర్ 28న మెహందీ వేడుక, 29న సంగీత్ నైట్ నిర్వహించారు. చివరగా, అక్టోబర్ 30న గురువారం వివాహ బంధంలో అడుగుపెట్టింది ఈ జంట. ‘ప్రతినిధి 2’ చిత్రంలో జంటగా నటించిన నారా రోహిత్, శిరీష.. ఇప్పుడు నిజ జీవితంలోనూ ఒక్కటయ్యారు. ప్రస్తుతం వీరి పెళ్లి ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ క్రమంలో నారా రోహిత్ ఫ్యాన్స్ శుభాకాంక్షలు చెబుతూ లైక్స్ కొడుతున్నారు.
‘ప్రతినిధి-2’ సెట్స్‌లో చిగురించిన ప్రేమ బంధం
రోహిత్, శిరీషల పరిచయం వెనుక ఒక ఆసక్తికరమైన నేపథ్యం ఉంది. వారిద్దరూ కలిసి నటించిన 'ప్రతినిధి–2' సినిమా షూటింగ్ సమయంలోనే స్నేహం ఏర్పడింది. అది క్రమంగా ప్రేమగా మారింది. ఇరు కుటుంబాల అంగీకారంతో గత ఏడాది అక్టోబర్ 13న హైదరాబాద్‌లోని నోవాటెల్ హోటల్‌లో వీరి నిశ్చితార్థం ఘనంగా జరిగింది. అయితే, నిశ్చితార్థం జరిగిన కొద్ది కాలానికే రోహిత్ తండ్రి నారా రామ్మూర్తి నాయుడు కన్నుమూయడంతో పెళ్లిని వాయిదా పడింది. దాదాపు ఏడాది తర్వాత ఇప్పుడు పెళ్లి తేదీ ఖరారు చేశారు. సినీ పరిశ్రమలో ఈ వివాహం'ఈ ఏడాది అత్యంత ఆకర్షణీయమైన స్టార్ వెడ్డింగ్'గా నిలిచింది.
