'జగనన్న పాలవెల్లువ' పథకం ప్రారంభం

'జగనన్న పాలవెల్లువ' పథకం ప్రారంభం

ఏపీ కృష్ణా జిల్లాలో 'జగనన్న పాలవెల్లువ' కార్యక్రమాన్ని ప్రారంభించారు సీఎం వైఎస్ జగన్. గుంటూరు జిల్లా తాడేపల్లి క్యాంప్  ఆఫీస్ నుంచి పథకాన్ని మొదలు పెట్టారు. పథకంతో పాడి రైతులకు మరింత మెరుగైన ధర వస్తుందన్నారు జగన్. ఇప్పటికే 5 జిల్లాల్లో పాలవెల్లువ కార్యక్రమం ప్రారంభమైందని చెప్పారు. అమూల్  సంస్థ  ఇప్పటి వరకు 148 లక్షల లీటర్ల పాల సేకరణ చేసిందని వివరించారు. ఇతర డైరీలతో పోల్చితే అమూల్  10 కోట్లు అదనంగా ఇచ్చిందన్నారు జగన్.  గత పాలకుల నిర్లక్ష్యంతో నష్టాల్లో ఉన్న ప్రభుత్వ సహకార డెయిరీలను ఆదుకుంటున్నామని చెప్పారు.  జగనన్న పాలవెల్లువ పథకం ద్వారా పాలకు గిట్టుబాటు ధర, పాడి రైతుకు ఆర్థిక భరోసా లభించనుందని తెలిపారు. గతేడాది నవంబర్‌లో అమూల్‌ సంస్థతో కలిసి ఈ పథకాన్ని ప్రారంభించారు. క్రమంగా ఈ పథకం రాష్ట్రమంతటా విస్తరిస్తుంది. జనవరిలో అనంతపురం, విశాఖపట్నం జిల్లాల్లోనూ ఈ పథకాన్ని విస్తరించేందుకు ప్రభుత్వం కార్యాచరణ ఇప్పటికే తయారు చేసింది.

ఇవి కూడా చదవండి:

వీడియో: అయ్యయ్యో అధిక చార్జీలు వద్దమ్మా!

పనిచేయలేదు.. నా జీతం కట్ చేయండి