ఏపీ డీజీపీకి షాక్ ఇచ్చిన జగన్ సర్కార్

ఏపీ డీజీపీకి షాక్ ఇచ్చిన జగన్ సర్కార్

ఏపీ డీజీపీ గౌతమ్ సవాంగ్‌కు జగన్ సర్కార్ షాక్ ఇచ్చింది. గౌతమ్ సవాంగ్‌ను బదిలీ చేసింది. ఆయనను రాష్ట్ర సాధారణ పరిపాలన విభాగాంలో రిపోర్ట్ చేయాల్సిందిగా ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఏపీ కొత్త డీజీపీగా కసిరెడ్డి రాజేంద్రనాథ్ రెడ్డిని నియమించారు. రాజేంద్రనాథ్ రెడ్డి ప్రస్తుతం  రాష్ట్ర ఇంటెలిజెన్స్ చీఫ్‌గా ఉన్నారు. గౌతమ్ సవాంగ్ పదవీకాలం 2023 జూలై వరకు ఉంది. ఈలోపే అతనిపై బదిలీ వేటు పడటం ఇప్పుడు రాష్ట్ర పోలీస్ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది. 

మొన్నటి దాకా సీఎం పేషీలో అత్యంత కీలక పాత్ర పోషించిన సీనియర్‌ ఐఏఎస్‌ అధికారి ప్రవీణ్‌ ప్రకాష్‌పై బదిలీ వేటు పడి 24 గంటలు కూడా పూర్తి కాకుండానే రాష్ట్ర డీజీపీ గౌతమ్‌ సవాంగ్‌పై బదిలీ వేటు పడటం ఇప్పుడు సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు విజయవాడలో నిర్వహించిన ర్యాలీ విషయంలో గౌతమ్‌ సవాంగ్‌ పాత్రపై సీఎం తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. 

ఇవి కూడా చదవండి: 

వైఎస్ షర్మిల అరెస్టు

శ్రీవారి సర్వదర్శనం టోకెన్లు జారీ