
ఆంధ్రప్రదేశ్ లో MPTC, ZPTC ఎన్నికలపై ఇవాళ(శుక్రవారం) హైకోర్టు సంచలన తీర్పు ఇచ్చింది. ఈ ఏడాది ఏప్రిల్ 8న జరిగిన పరిషత్ ఎన్నికలను రద్దు చేసింది. కొత్త నోటిఫికేషన్ ఇవ్వాలని ఆదేశించింది. ఎన్నికలకు సంబంధించి దాఖలైన పిటిషన్లపై విచారించిన కోర్టు.. సుదీర్ఘ విచారణ తర్వాత శుక్రవారం తీర్పునిచ్చింది. సుప్రీం సూచించిన నిబంధనల ప్రకారం ఎన్నికలు జరగలేదని హైకోర్టు అభిప్రాయపడింది.