టీటీడీ బోర్డు సభ్యుల నియామకాల జీవోపై హైకోర్టు స్టే

టీటీడీ బోర్డు సభ్యుల నియామకాల జీవోపై హైకోర్టు స్టే

టీటీడీ (తిరుమల తిరుపతి దేవస్థానం)  బోర్డులో ప్రత్యేక ఆహ్వానిత సభ్యుల నియామకంపై స్టే విధిచింది ఏపీ  హైకోర్టు.  ప్రభుత్వ జీవోను తాత్కాలికంగా ఆపేస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. కొద్ది రోజుల క్రితం ఏపీ  ప్రభుత్వం టీటీడీ  బోర్డులో సభ్యులతో పాటు భారీగా ప్రత్యేక ఆహ్వానితులను నియమించింది. పెద్ద సంఖ్యలో ప్రత్యేక ఆహ్వానితులను నియమించడాన్ని సవాల్  చేస్తూ హైకోర్టులో మూడు పిటిషన్లు దాఖలయ్యాయి. నిబంధనలకు విరుద్ధంగా బోర్డు సభ్యులను నియమించారని, దీని వల్ల సామాన్య భక్తులకు ఇబ్బంది కలుగుతుందని పిటిషనర్లు వివరించారు. టీటీడీ  స్వతంత్రతను దెబ్బతీసేలా జీవోలు ఉన్నాయని పిటిషనర్  తరఫున న్యాయవాదులు వాదించారు. నిబంధనలనకు అనుగుణంగానే నియమకాలు చేపట్టామని ప్రభుత్వం తరఫు న్యాయవాది కోర్టుకు తెలిపారు. ఇరు పక్షాల వాదనలు విన్న హైకోర్టు ప్రత్యేక ఆహ్వానితుల నియామక జీవోను తాత్కాలికంగా ఆపేస్తూ ఆదేశాలు ఇచ్చింది.