కోర్డును ఆశ్రయించిన అభ్యర్థులు.. డీఎస్సీపై ఏపీ హైకోర్టు కీలక ఆదేశాలు..

కోర్డును ఆశ్రయించిన అభ్యర్థులు.. డీఎస్సీపై ఏపీ హైకోర్టు కీలక ఆదేశాలు..

డీఎస్సీ నోటిఫికేషన్ పై ఏపీ హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. ఇటీవల జగన్ సర్కార్.. 6100 టీచర్ పోస్టుల భర్తీకి DSC నోటిఫికేషన్ ఇచ్చిన సంగతి తెలిసిందే. అయితే, నోటిఫికేషన్ లో బీఈడీ అభ్యర్థులు కూడా ఎస్‌జీటీ పోస్టులకు అర్హులేనని ప్రభుత్వం ప్రకటించింది. దీంతో పలువురు అభ్యర్థులు.. ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. 

ఈ క్రమంలో ఫిబ్రవరి 21వ తేదీ బుధవారం విచారణ చేపట్టిన ఏపీ హైకోర్టు.. ఎస్జీటీ పోస్టుల భర్తీకి బీఈడీ అభ్యర్థులను అనుమతించే నిబంధనపై స్టే విధించింది. తదుపరి విచారణ 8 వారాలకు వాయిదా వేస్తూ కోర్టు తీర్పు వెల్లడించింది.