ఐఏఎస్ శ్రీలక్ష్మి పిటిషన్ కొట్టేసిన ఏపీ హైకోర్టు

 ఐఏఎస్ శ్రీలక్ష్మి పిటిషన్ కొట్టేసిన ఏపీ హైకోర్టు

అమరావతి: తనకు విధించిన శిక్షను పునః పరిశీలించాలని కోరుతూ సీనియర్ ఐఏఎస్ అధికారిణి శ్రీలక్ష్మికి దాఖలు చేసిన రివ్యూ పిటిషన్‌ను ఏపీ హైకోర్టు కొట్టేసింది. హాస్టళ్లలో సామాజిక సేవ చేయాలనే శిక్ష విధిస్తూ గతంలో ఇచ్చిన తీర్పును రివ్యూ చేయాలని కోరుతూ శ్రీలక్ష్మి పిటిషన్ దాఖలు చేశారు.
విద్యాలయ ప్రాంగణాల్లో ఆర్‌బీకేలు, గ్రామ సచివాలయాల నిర్మాణం చేయవద్దని హైకోర్టు తీర్పు ఇచ్చిన విషయం తెలిసిందే. 

ఈ తీర్పును అమలు చేయకపోవడంలో విఫలమైన ఎనిమిది మంది ఐఏఎస్ అధికారులకు రెండు వారాల శిక్ష విధిస్తూ తీర్పువెలువరించింది. ఈ తీర్పుపై రివ్యూ కోరుతూ శ్రీలక్ష్మి పిటిషన్ దాఖలు చేయగా విచారణ అర్హతపై సందేహం వ్యక్తం చేస్తూ స్వీకరించేందుకు రిజిస్ట్రీ నిరాకరించారు. అయితే  గతంలో ఇలాంటి పిటిషన్లపై విచారణ జరిపారని గుర్తు చేస్తూ శ్రీలక్ష్మి తరపు న్యాయవాది తెలపడంతో విచారణకు కోర్టు అంగీకరించింది. రివ్యూ పిటిషన్ ను విచారించిన హైకోర్టు ధర్మాసనం పిటిషన్ ను కొట్టేసింది. 

 

ఇవి కూడా చదవండి

అక్బరుద్దీన్పై నమోదైన కేసుల కొట్టివేత

కేసీఆర్ చేసిన తప్పుకు రైతులు బలయ్యారు

కేసీఆర్ అరెస్ట్ కావడం ఖాయం