తెలుగుదేశం లాంటి కేన్సర్​ గడ్డ ఏపీకి చాలా ప్రమాదకరం: మంత్రి అంబటి 

తెలుగుదేశం లాంటి కేన్సర్​ గడ్డ ఏపీకి చాలా ప్రమాదకరం: మంత్రి అంబటి 

తెలంగాణ ఎన్నికల్లో జనసేన పోటీ చేయడంపై ఏపీ మంత్రి అంబటి స్పందించారు.  తెలుగుదేశం ఎవరికి మద్దతు ఇవ్వలేదని చంద్రబాబు చెబుతున్నారని ...కాని జనసేన పోటీచేసిన చోట టీడీపీ జండాలు కనపడ్డాయని.. అయినా జనసేన అభ్యర్థులకు బర్రలక్కకు వచ్చిన ఓట్లు  కూడా రాలేదన్నారు. 

పవన్​ కళ్యాణ్ పార్టీ ​ తెలంగాణలో 8 స్థానాల్లో పోటీ చేసిందని... కాని  ఒక్క కూకట్​ పల్లిలో తప్పితే మిగతా ఏడు స్థానాల్లో  నోటాతో జనసేన అభ్యర్థులు నోటాతో  పోటీపడ్డారని ఏపీ మంత్రి అంబటి రాంబాబు అన్నారు. ఆంధ్రప్రదేశ్​ లో ఉర్లగడ్డ... ఎర్రగడ్డ ప్రమాదం కాదని.. తెలుగుదేశం లాంటి కేన్సర్ గడ్డ​ చాలా ప్రమాదకరమని అంబటి  అన్నారు.   దీని పక్కనే జనసేన కేన్సర్​ గడ్డ కూడా చేరుతుందని అది ఇంకా  ప్రమాదమన్నారు.  పవన్​ మూడు విషయాలను గమనించాలన్నారు.  ముష్టి వేసినట్లు  సీట్లు పడేస్తాడని... జనసేనకు పోటీ చేయడానికి అభ్యర్థులు లేకపోతే  చంద్రబాబే జనసేనకు పంపిస్తాడంటూ.. ఇక జనసేన పోటీ చేసినచోట టీడీపీ వారు తుక్కుతుక్కుగా ఓడిస్తారని మంత్రి అంబటి అన్నారు.