
ఏపీకి రావాలంటే పాస్ పోర్టు, వీసా కావాలన్న పవన్ పై మంత్రి రోజా మండిపడ్డారు. ఆ నాడు ముద్రగడ పద్మనాభంను చంద్రబాబు ఇబ్బంది పెట్టినపుడు పవన్ ఎక్కడున్నారని ప్రశ్నించారు. చిరంజీవిని ఎయిర్ పోర్టులో అడ్డుకున్నపుడు ఎందుకు రోడ్లపై దొర్లలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. పవన్ పార్టీ పెట్టింది ప్రజల కోసమా? చంద్రబాబు కోసమా? అని ప్రశ్నించారు. జగన్ తన కూతుళ్లను చూడటానికి లండన్ వెళ్తే.. దోచుకున్న డబ్బును దాచుకోవడానికి వెళ్లారంటూ పవన్ దిగజారిపోయి వ్యాఖ్యలు చేశారన్నారు.
పవన్ కు దమ్ముంటే బీజేపీ వాళ్లతో మాట్లాడి ఎలాంటి విచారణ అయినా చేసుకోవాలని సవాల్ విసిరారు రోజా. చంద్రబాబు షెల్ కంపెనీల్లో పవన్ కూడా వాటా ఉన్నట్టుందని ఆరోపించారు. సాక్షాధారాలతో దొరికితే ఎవరిని వదిలిపెట్టబోమని వార్నింగ్ ఇచ్చారు. సామాన్యుడికి గానీ .. చంద్రబాబుకి కానీ..ఆయనను పుట్టించిన తండ్రి ఖర్జూర నాయుడికైనా ఒక్కటే చట్టం అని అన్నారు . ఇంకోసారి రాజకీయ కక్షసాధింపులని ఊదరగొడితే ..ఊర్ల నుంచి తరిమి కొడతారని హెచ్చరించారు. టీడీపీ బంద్ ను ప్రజలు పట్టించుకోకుండా పనులు చేసుకుంటున్నారని చెప్పారు.
సాక్షాధారాలతో దొంగ దొరికితే ఇంకా రాజకీయ కక్షసాధింపనడం సిగ్గు చేటన్నారు. చంద్రబాబు వ్యవస్థలను మేనేజ్ చేయడంతో దిట్ట అని అన్నారు. చంద్రబాబు ఎవరినైనా చంపేస్తారు కానీ.. చంద్రబాబును చంపే వాడు ఇంకెవడు పుట్టలేదన్నారు. చంద్రబాబు అరెస్ట్ తో ఎన్టీఆర్ అభిమానులంతా ఇవాళ హ్యాపీగా ఉన్నారని చెప్పారు.
ALSO READ :జైలుకు చంద్రబాబు.. టపాసులు కాల్చి స్వీట్లు పంచిన రోజా
పవన్ పై అంబటి సెటైర్లు
పవన్ కళ్యాణ్ తన పార్టీనీ కాపాడుకోకుండా చంద్రబాబు పార్టీని కాపాడటం ఎందుకని ప్రశ్నించారు. సొంత లాభం కొంత మానుకుని..పొరుగు వాడికి తోడుపడవోయి అని నాడు గురజాడ అంటే.. సొంత పార్టీని సర్వ నాశనం చేసుకుని పొరుగు పార్టీని బ్రతికించవోయ్ ! అని పవన్ నినాదమంటూ సెటైర్లు వేశారు.
తిక్కలోడు తిరునాళ్లకు వెళితే ఎక్కాదిగా సరిపోయినట్టు పవన్ పరిస్థితి తయారైందని ఎద్దేవా చేశారు. చంద్రబాబుకు మద్దతు ఎందుకిస్తున్నాడని ప్రశ్నించారు. ప్యాకేజీ నిజమేనా అని నిలదీశారు. చంద్రబాబును అరెస్ట్ చేస్తే రోడ్డు మీద పడుకుని అరుస్తున్న పవన్ కళ్యాణ్, ముద్రగడ దీక్ష చేస్తున్న సమయంలో కొట్టి బయటకు లాక్కొస్తే ఎక్కడున్నాడని ప్రశ్నించారు అంబటి.