ములాయం కోడలికి మంత్రి పదవి..!

ములాయం కోడలికి మంత్రి పదవి..!

ఉత్తర్ ప్రదేశ్లో బీజేపీ మరోసారి ప్రభుత్వ ఏర్పాటుకు సిద్ధమైంది. అసెంబ్లీ ఎన్నికల్లో ఘన విజయం సాధించిన ఆ పార్టీ.. యోగికి మరోసారి రాష్ట్ర పగ్గాలు అప్పగించనున్నట్లు సమాచారం. ఈ  క్రమంలోనే యోగి 2.0 కేబినెట్ కూర్పుపై దృష్టి  కేంద్రీకరించినట్లు తెలుస్తోంది. కేబినెట్‌ బెర్తుల విషయంపై ఢిల్లీ స్థాయిలో ముమ్మరంగా చర్చలు జరుపుతున్నారు. ఆదివారం యోగి ఆదిత్యనాథ్ ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్రమంత్రులు రాజ్‌నాథ్‌ సింగ్‌, అమిత్‌ షా, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీనడ్డాతో సమావేశం అయ్యారు. అయితే, ఈసారి గత కేబినెట్లో మంత్రులుగా పని చేసిన పలువురిని మార్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

కొత్త కేబినెట్‌లో ములాయం సింగ్ కోడలు అపర్ణా యాదవ్‌, పంకజ్‌ సింగ్‌, శలభ్‌మణి త్రిపాఠి, అసీమ్‌, అరుణ్‌, రాజేశ్వర్‌ సింగ్‌, దయాశంకర్‌ సింగ్‌ మంత్రులుగా అవకాశం కల్పించనున్నట్లు సమాచారం. ఎన్నికలకు ముందు ఎస్పీకి గుడ్ బై చెప్పి బీజేపీలో చేరిన అపర్ణ యాదవ్‌కు టికెట్ దక్కలేదు. ఈ క్రమంలో త్వరలో జరగనున్న శాసన మండలి ఎన్నికల్లో పార్టీ తరఫున ఆమెను బరిలోకి దింపే అవకాశమున్నట్లు వార్తలు వస్తున్నాయి.