ఏపీలో ఫోన్ ట్యాపింగ్ కలకలం: లోకేష్ కు ఆపిల్ అలర్ట్... ఈసీకి ఫిర్యాదు

ఏపీలో ఫోన్ ట్యాపింగ్ కలకలం:  లోకేష్ కు ఆపిల్ అలర్ట్... ఈసీకి ఫిర్యాదు

ఏపీలో అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికలు దగ్గరపడుతున్న వేల ఫోన్ ట్యాపింగ్ కలకలం రేపుతోంది. తమ ఫోన్లను ట్యాప్ చేస్తున్నారంటూ అధికార వైసీపీ మీద ప్రతిపక్ష టీడీపీ నేతలు చాలా కాలంగా ఆరోపణలు చేస్తున్నారు. తాజాగా ఫోన్ ట్యాపింగ్ కి సంబంధించిన కీలక ఆధారాలతో ఈసీకి ఫిర్యాదు చేసింది టీడీపీ. పార్టీ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ కు ఆపిల్ కంపెనీ నుండి హ్యాకింగ్ అలర్ట్ వచ్చింది. దీనిని ఆధారంగా చుపిస్తూ తగిన చర్యలు తీసుకోవాలని ఈసీకి ఫిర్యాదు చేశారు మాజీ రాజ్యసభ సభ్యుడు కనకమేడల రవీంద్ర కుమార్.

నారా లోకేష్ ఫోన్ ట్యాపింగ్ అవుతోందని, హ్యాకింగ్ కూడా జరిగే ఛాన్స్ ఉందని ఆపిల్ నుండి మెయిల్ వచ్చింది. దీంతో అప్రమత్తమైన లోకేష్ పార్టీ నేతలకు తెలియజేయగా వారు ఈసీకి ఫిర్యాదు చేశారు.గుర్తుతెలియని ఏజెన్సీల ద్వారా పెగాసస్ సాప్ట్‌వేర్‌ సాయంతో లోకేష్ ఫోన్‌ను ట్యాప్ చేసినట్లు మెసేజ్ లు వచ్చాయని ఈసీకి ఇచ్చిన ఫిర్యాదులో తెలిపింది టీడీపీ. గతంలో కూడా 2024 మార్చిలో లోకేష్ కు ఇలాంటి మెసేజ్ లు వచ్చాయని పేర్కొన్నారు టీడీపీ నేతలు.