ప్రపంచంలోనే నెంబర్‌‌వన్‌ కంపెనీగా యాపిల్

ప్రపంచంలోనే నెంబర్‌‌వన్‌ కంపెనీగా యాపిల్

ఒక్క రోజే 172 బిలియన్‌‌ డాలర్లు
పెరిగిన మార్కెట్‌‌క్యాప్‌
సెకెండ్‌ ప్లేస్‌కు సౌదీ ఆరామ్‌‌కో

న్యూఢిల్లీ: స్మార్ట్ ఫోన్ల‌ తయారీ కంపెనీ యాపిల్ ‌మార్కెట్ ‌‌క్యాప్ ‌‌విషయంలో ఆయిల్ ‌‌కంపెనీ సౌదీ ఆరామ్‌‌కోను అధిగమించింది. దీంతో ప్రపంచంలోనే మోస్ట్ ‌వాల్యూడ్ ‌‌కంపెనీగా మారింది. కంపెనీ క్వార్టర్లీ రిజల్ట్స్ బాగుడ‌డంతో శుక్రవారం సెషన్‌‌లో యాపిల్ ‌షేర్లు 10శాతంపైగా ర్యాలీ చేశాయి. దీంతో కంపెనీ మార్కెట్ ‌క్యాప్ ‌‌ఈ ఒక్కరోజే 172 బిలియన్ ‌‌డాలర్లు పెరిగింది. ఇది ఒరాకిల్ ‌‌మొత్తం మార్కెట్ ‌‌క్యాప్ ‌‌కంటే ఎక్కువ కావడం విశేషం. యాపిల్ ‌‌షేరు శుక్రవారం సెషన్‌‌లో 425.04 డాలర్ల వద్ద క్లోజ్ అయ్యింది. ఈ ధర వద్ద కంపెనీ మార్కెట్ ‌‌క్యాప్ ‌‌1.82ట్రిలియన్ ‌‌డాలర్లుగా ఉంది. అదే సౌదీ ఆరామ్‌‌కో మార్కెట్ ‌‌క్యాప్ ‌‌శుక్రవారం 1.76 ట్రిలియన్ ‌‌డాలర్లుగా నమోదైంది.

గతేడాది ఐపీఓకి వచ్చిన తర్వాత నుంచి శుక్రవారం వరకు సౌదీ ఆరామ్‌‌కోనే నెంబర్‌ వన్ ‌కంపెనీగా నిలిచింది.ఈ జూన్‌‌తో ముగిసిన క్వార్టర్‌‌లో 16బిలియన్ డాలర్ల విలువైన షేర్ల‌ను యాపిల్‌ బ్యాక్ ‌‌చేసుకుంది. ఈ ఏడాది ప్రారంభం నుంచి శుక్రవారం నాటికి యాపిల్‌‌ షేర్లు 45 శాతం పెరిగాయి. తన క్వార్టర్లీ రిపోర్ట్ లో‌ షేర్ స్పిట్‌‌ను యాపిల్ ‌‌ప్రకటించింది. ఒక్క షేరును 4 షేర్లుగా విభజించనుంది. ఈషేర్‌ స్ప్లిట్ ‌‌ఆగస్ట్‌31 నుంచి అమలులోకి వస్తుంది. 2014తర్వాత యాపిల్‌‌ కంపెనీకి ఇదే మొదటిషేర్‌ స్ప్లిట్‌‌. కంపెనీ రిజల్ట్స్ బాగుండడంతో 20 బ్రోకరేజి కంపెనీలు యాపిల్‌‌పై తమ టార్గె‌‌ట్ ధరను పెంచాయి.

మ‌రిన్ని వార్త‌ల కోసం..