నాన్​ లేఅవుట్ ​ప్లాట్ల రెగ్యులరైజేషన్​ ఎప్పుడు..జిల్లాలో 67 వేల అప్లికేషన్లు పెండింగ్​

నాన్​ లేఅవుట్ ​ప్లాట్ల రెగ్యులరైజేషన్​ ఎప్పుడు..జిల్లాలో 67 వేల అప్లికేషన్లు పెండింగ్​

నిజామాబాద్, వెలుగు:  లే అవుట్​ చేయని ఇండ్ల ప్లాట్లను రెగ్యులరైజేషన్​చేయడానికి అప్లికేషన్లు తీసుకున్న గవర్నమెంట్​మూడేళ్ల నుంచి పెండింగ్​లో ఉంచింది. రెగ్యులరైజేషన్​ ​పెండింగ్​లో పెట్టి, ఇలాంటి ప్లాట్లు రిజిస్ట్రేషన్​చేయొద్దని ఇంటర్నల్​గా ఆదేశాలిచ్చింది. ఫలితంగా ఇండ్ల స్థలాల సేల్స్​ నిలిచి, వాటి యజమానులు ఇబ్బందులు పడుతున్నారు.

జిల్లాలో రూ.6.70 కోట్లు వసూలు..

జిల్లాలో నాన్​ లేఅవుట్ ​ప్లాట్లు రెగ్యులరైజ్​ చేయడానికి 2020లో గవర్నమెంట్​అప్లికేషన్లు కోరగా, నిజామాబాద్ ​కార్పొరేషన్, బోధన్, ఆర్మూర్, భీంగల్ మున్సిపాలిటీల పరిధిలో 67,110 మంది దరఖాస్తు చేసుకున్నారు. ఒక్కో దరఖాస్తుకు రూ.వెయ్యి చొప్పున మొత్తం రూ.6.70 కోట్ల ఫీజు వసూలు చేశారు.  ప్లాట్ల రెగ్యులరైజేషన్​ కోసం గవర్నమెంట్​ ఫిక్స్​చేసే ఫీజును పే చేయడానికి సిద్ధపడిన వారు, ఆర్జీలు పెట్టుకున్నారు. 

సాదాబైనామా తరహాలో.. 

తెల్లకాగితాలు, స్టాంప్​పేపర్లపై కొన్న అగ్రికల్చర్​ల్యాండ్స్​కు పట్టాపాస్​ పుస్తకాలు ఇస్తామని ఉమ్మడి జిల్లా నుంచి 36,787 దరఖాస్తులు తీసుకొని 2020 నుంచి పెండింగ్​ పెట్టిన లిస్ట్​లో ఇప్పుడు నాన్​ లేఅవుట్​ప్లాట్ల ఇష్యూ చేరింది. చేసే ఉద్దేశం లేనప్పుడు అసలు అప్లికేషన్లు ఎందుకు తీసుకోవాలని దరఖాస్తుదారులు ప్రశ్నిస్తున్నారు.

రిజిస్ట్రేషన్లలపై ఎఫెక్ట్..​ 

నాన్ ​లేఅవుట్ ​ప్లాట్లు ఉన్న కాలనీలతో సమస్య వస్తోందని, కాలనీల్లో రోడ్ల నిర్మాణం, డ్రైనేజీ, పాఠశాల తదితర మౌలిక వసతుల కల్పనకు ఇబ్బంది కలుగుతోందని గవర్నమెంట్​తన నిర్ణయానికి కారణం చూపింది. లే అవుట్ ​ప్లాట్​కు చట్టబద్ధత ఉంటుందని, వెంచర్ల విస్తీర్ణంలో ప్రభుత్వానికి లభించే 30 శాతం ల్యాండ్​లో ఈ సౌలత్​లు చేయొచ్చని ప్రకటించి, నాన్​లే అవుట్​ ప్లాట్ల అమ్మకాలను పూర్తిగా ఆపేసింది. ఈ క్రమంలో నాన్ ​లేఅవుట్ ​వెంచర్లు వేసిన వారి వ్యాపారం మొత్తానికి నిలిచిపోయింది. గవర్నమెంట్​ఎలాంటి నిర్ణయం తీసుకున్నా ఓకే చెప్పడానికి వారు సిద్ధంగా ఉన్నారు. వెంచర్లు వేసిన రియల్టర్ల సంగతి పక్కనబెడితే స్థిరాస్తి  కోణంలో నాన్ ​లేఅవుట్ ​ప్లాట్లు కొనుగోలు చేసి, రెగ్యులరైజేషన్ ​కోసం అప్లికేషన్లు 
పెట్టుకున్నవారు అయోమయంలో ఉన్నారు. 

దీపక్​ అనే వ్యక్తి బోధన్​లో పదేళ్ల కింద నాన్​ లేఅవుట్ ​ప్లాట్​కొన్నాడు. ఆ స్థలం అమ్మి, వచ్చిన డబ్బుతో కూతరు పెళ్లి చేయాలనుకోగా దాన్ని కొనడానికి ఎవరు ముందుకు రాకపోవడంతో ఆరా తీశాడు.తన ప్లాట్​ మరొకరికి రిజిస్ట్రేషన్​ కాదని తెలిసి షాకయ్యాడు. అమ్ముడవుతుందన్న నమ్మకంతో కూతురు పెళ్లి కోసం బయట అప్పు చేశాడు. రెగ్యులరైజేషన్​​ అప్లికేషన్​ పెట్టుకొని మూడేళ్ల నుంచి ఎదురు చూస్తున్నాడు. నగరానికి చెందిన మల్లేశ్ తన కొడుకు ఉన్నత విద్య ఖర్చులకు ఉపయోగపడుతుందని ఏడేళ్ల కింద నగరంలో 200 గజాల ఇంటి జాగా కొన్నాడు. తీరా అమ్మే టైమ్​కు నాన్​ లేఅవుట్ ​అంటూ ఎవరూ 
కొనడం లేదు.