
- ఈ నెల17 లోపు అప్లికేషన్లు సమర్పించాలి
- కలెక్టర్ పమేలా సత్పతి
కరీంనగర్ టౌన్, వెలుగు: భూమికి సంబంధించిన సమస్యలను పరిష్కరించేందుకు ప్రభుత్వం ప్రతిష్టాత్మకమైన భూ భారతి రెవెన్యూ చట్టం 2025 తీసుకొచ్చిందని ఇందులో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా 5 వేల మంది లైసెన్స్‌డ్ సర్వేయర్లకు శిక్షణ ఇవ్వనున్నట్లు వారు ఈ నెల 17 లోపు దరఖాస్తు చేసుకోవాలని గురువారం కలెక్టర్ పమేలా సత్పతి ఒక ప్రకటనలో తెలిపారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. రెవెన్యూ అడ్మినిస్ట్రేషన్, సర్వే అండ్ ల్యాండ్ రికార్డ్స్ డిపార్ట్‌మెంట్ ఆధ్వర్యంలో రాష్ట్రంలో దాదాపు 5 వేల మంది లైసెన్స్ పొందిన సర్వేయర్లకు ఈ శిక్షణ ఇవ్వనున్నట్లు వెల్లడించారు.