గత నెలతో పోలిస్తే నవంబరులో తగ్గినయ్

గత నెలతో పోలిస్తే నవంబరులో తగ్గినయ్

ముంబై: ఎకనమిక్‌ యాక్టివిటీ బాగానే ఉన్నప్పటికీ నవంబర్‌‌‌‌‌‌‌‌లో జాబ్ పోస్టింగ్స్‌‌‌‌ పెరగలేదని,    టైర్–2 నగరాల్లో  నియామకాలు మాత్రం బాగానే ఉన్నాయని తాజా స్టడీ ఒకటి తెలిపింది.  అక్టోబర్‌‌‌‌తో పోలిస్తే ఈ ఏడాది నవంబర్‌‌‌‌లో జాబ్ పోస్టింగ్ యాక్టివిటీ నిలకడగా ఉందని మాన్‌‌‌‌స్టర్ ఎంప్లాయ్‌‌‌‌మెంట్ ఇండెక్స్  పేర్కొంది. ఇండస్ట్రీలలో నియామకాల డిమాండ్2020 నవంబరుతో పోలిస్తే  మునుపటి నెలలో తొమ్మిది శాతం పెరిగింది. కరోనా సెకండ్‌‌‌‌వేవ్‌‌‌‌ తర్వాత ఆర్థిక కార్యకలాపాలు పెరగడమే ఈ పరిస్థితికి కారణం. వర్క్‌‌‌‌ ఫ్రం హోం చాలా వరకు తగ్గడంతో ఆఫీసుల్లో మునుపటి రద్దీ కనిపిస్తోంది. అందుకే ఆఫీస్ పరికరాలు/ఆటోమేషన్ (21 శాతం) ఇండస్ట్రీ నెలవారీగా జాబ్‌‌‌‌ పోస్టింగ్స్‌‌‌‌లో అత్యధిక గ్రోత్‌‌‌‌ను సాధించింది. దీని తర్వాత టెలికాం/ఐఎస్‌‌‌‌పీ (14 శాతం), ప్రింటింగ్/ప్యాకేజింగ్ (7 శాతం), గార్మెంట్స్/ టెక్స్‌‌‌‌టైల్స్/ లెదర్, రత్నాలు  ఆభరణాలు (4 శాతం), చమురు/ గ్యాస్/ పెట్రోలియం, పవర్ (3 శాతం)  ట్రావెల్ అండ్ టూరిజం (3 శాతం) పరిశ్రమలు ఉన్నాయి. రిటైల్, బ్యాంకింగ్/ఫైనాన్షియల్ సర్వీసెస్, ఇన్సూరెన్స్, ఎడ్యుకేషన్, లాజిస్టిక్స్, కొరియర్/ సరుకు రవాణా/రవాణా వంటి పరిశ్రమలు నవంబర్‌‌‌‌లో చెప్పుకోదగ్గ ప్రగతి సాధించలేదు.  షిప్పింగ్/మెరైన్ (-9 శాతం), ఐటీ, -హార్డ్‌‌‌‌వేర్ & సాఫ్ట్‌‌‌‌వేర్ (-3 శాతం), ఎఫ్‌‌‌‌ఎంసీజీ, ఫుడ్ అండ్ ప్యాకేజ్డ్ ఫుడ్ (-2 శాతం),  హెల్త్‌‌‌‌కేర్, బయోటెక్నాలజీ  లైఫ్ సైన్సెస్, ఫార్మాస్యూటికల్స్ ( -2 శాతం) ఇండస్ట్రీల్లో అంతకుముందు నెలతో పోలిస్తే నవంబరులో నియామకాలు తగ్గాయి. 


కోల్‌‌‌‌కతా నంబర్‌‌‌‌వన్‌‌‌‌
నగరాలవారీగా జాబ్‌‌‌‌ పోస్టింగ్స్‌‌‌‌ను చూస్తే,  కోల్‌‌‌‌కతా నుంచి నవంబర్‌‌‌‌లో జాబ్ పోస్టింగ్స్‌‌‌‌ అంతకుముందు నెలతో పోలిస్తే రెండు శాతం పెరిగాయి.  కోయంబత్తూర్,  జైపూర్‌‌‌‌లో గ్రోత్‌‌‌‌ నిలకడగా ఉంది. కోల్‌‌‌‌కతాలో మాన్యుఫాక్చరింగ్‌‌‌‌, ప్రొడక్షన్‌‌‌‌ ఇండస్ట్రీలో జాబ్స్ 19 శాతం పెరిగాయి. అయితే  పుణె (-4 శాతం), బెంగళూరు (-3 శాతం), ఢిల్లీ-–ఎన్‌‌‌‌సిఆర్ (-3 శాతం), చెన్నై (-2 శాతం), హైదరాబాద్ (-2 శాతం)  ముంబయి ( -1 శాతం)లో నియామక కార్యకలాపాలు తగ్గాయి. కొచ్చి (-4 శాతం), చండీగఢ్ (-3 శాతం), అహ్మదాబాద్ (-2 శాతం), బరోడా (-1 శాతం) వంటి నగరాల్లోనూ జాబ్‌‌‌‌ పోస్టింగ్‌‌‌‌ పడిపోయాయి.  "ఈ నెలలో నియామక కార్యకలాపాలు పెద్దగా లేవు. కోయంబత్తూర్,  కోల్‌‌‌‌కతా వంటి టైర్-–2 సిటీల్లో పరిస్థితి కాస్త బాగుంది. కొత్త సంవత్సరంలో మరిన్ని కంపెనీల ఆఫీసులు ఓపెన్‌‌‌‌ అవుతున్నాయి.   హైబ్రిడ్ వర్క్‌‌‌‌ఫోర్స్ మోడల్‌‌‌‌లను కూడా ఉపయోగించాలని కోరుకుంటున్నాయి. అందుకే ఆఫీస్ ఆటోమేషన్‌‌‌‌లో కూడా భారీ పెట్టుబడులు పెట్టాయి’’ అని మాన్‌‌‌‌స్టర్ డాట్‌‌‌‌కామ్‌‌‌‌ సీఈఓ శేఖర్ గరీసా అన్నారు. జీతాల గురించి మాట్లాడుతూ,  ఐటీ ఇండస్ట్రీలో గత నెల జీతాలు సానుకూల సెంటిమెంట్‌‌‌‌లను సూచిస్తున్నాయని, ఈ రంగంలో ప్రొఫెషనల్స్‌‌‌‌కు డిమాండ్‌‌‌‌ పెరుగుతున్నదని  ఆయన పేర్కొన్నారు. తమ కంపెనీ మాన్‌‌‌‌స్టర్ ఎంప్లాయ్‌‌‌‌మెంట్ ఇండెక్స్ పేరుతో ప్రతినెలా ఆన్‌‌‌‌లైన్ జాబ్ పోస్టింగ్ యాక్టివిటీని పరిశీలిస్తుందని శేఖర్‌‌‌‌ వివరించారు. ఇదిలా ఉంటే సీనియర్లకు అవకాశాలు పెరుగుతున్నాయని ఈ ఇండెక్స్‌‌‌‌ సూచించింది. టాప్ మేనేజ్‌‌‌‌మెంట్ ప్రొఫెషన్సల్‌‌‌‌ (16 సంవత్సరాలకు పైగా) నియామకాలు రెండు శాతం, సీనియర్ లెవెల్‌‌‌‌ (11–-15 సంవత్సరాలు) నియామకాలు ఒకశాతం, మిడ్–-సీనియర్ లెవెల్‌‌‌‌ (7–-10 సంవత్సరాలు) ప్రొఫెషనల్స్‌‌‌‌ నియామకాలు 3 శాతం పెరిగాయి.  ఇంటర్మీడియట్ లెవెల్‌‌‌‌ (4–-6 సంవత్సరాలు), ఎంట్రీ లెవెల్‌‌‌‌ రోల్స్‌‌‌‌ (0–-3 సంవత్సరాలు) అక్టోబరుతో పోలిస్తే గత నెల ఒక శాతం మాత్రమే పెరిగాయి.