వనపర్తి, వెలుగు : బిల్లులు చెల్లించట్లేదని కాంట్రాక్టర్ ఆత్మహత్యకు యత్నించిన ఘటన వనపర్తి జిల్లాలో జరిగింది. వివరాలు ఇలా ఉన్నాయి. వనపర్తి కలెక్టరేట్ లో అడిషనల్ కలెక్టర్ క్వార్టర్స్ లో వాచ్మెన్ రూమ్ ను కట్టే పనులను కాంట్రాక్టర్ ఎ.రామన్ గౌడ్ పంచాయతీ రాజ్ శాఖ నుంచి దక్కించుకున్నారు.
నాలుగైదు నెలల కిందే నిర్మాణం పూర్తయినా, బిల్లుల మంజూరుకు కొన్నాళ్లుగా రామన్ గౌడ్ ను తిప్పించుకుంటున్నారు. దీంతో మనస్తాపం చెందిన ఆయన మంగళవారం సాయంత్రం ఏడీసీ క్వార్టర్వద్దకు వెళ్లి పెట్రోల్ పోసుకుని నిప్పంటించుకోబోగా, అక్కడే ఉన్న సెక్యూరిటీ సిబ్బంది చూసి అడ్డుకున్నారు. అతనిపై నీళ్లు పోశారు.
ఘటనపై పంచాయతీ రాజ్డీఈ లక్ష్మారెడ్డిని వివరణ కోరగా, బిల్లులకు తమకు సంబంధం లేదని, 15 రోజుల కిందనే మంజూరుకు పే మెంట్అథారిటీకి ఫైల్ఫార్వర్డ్ చేశామని చెప్పారు.
