స్త్రీనిధి ఎండీగా ఐఏఎస్​ను నియమించండి

స్త్రీనిధి ఎండీగా ఐఏఎస్​ను నియమించండి
  •      సర్కారుకు స్త్రీనిధి సంక్షేమ సంఘం వినతి

హైదరాబాద్, వెలుగు :  స్త్రీనిధి ఎండీగా ఐఏఎస్ అధికారిని నియమించాలని స్త్రీనిధి ఉద్యోగుల సంక్షేమ సంఘం వర్కింగ్ ప్రెసిడెంట్ అరుణ్ సింగ్ ప్రభుత్వాన్ని  కోరారు. 12 ఏండ్ల నుంచి నాబార్డ్ రిటైర్డ్ అధికారి విద్యాసాగర్​రెడ్డి  ఎండీ గా కొనసాగుతున్నారని తెలిపారు. ఆయనపై నిధుల మళ్లింపు వంటి అభియోగాలు ఉన్నాయని మంగళవారం విడుదల చేసిన ఓ ప్రకటనలో ఆరోపించారు. ఎండీతో సహా మరో ఆరుగురు రిటైర్డ్ అధికారులు ఉన్నత పదవు ల్లో ఎన్నో ఏండ్లుగా కొనసాగుతున్నారని చెప్పా రు. దీంతో సీనియర్ అధికారులకు ప్రమోషన్లు రాకుండా రిటైర్ అవుతున్నారని అరుణ్ సింగ్ ఆవేదన వ్యక్తం చేశారు. అలాగే, స్త్రీనిధిలో పనిచేస్తున్న 300 మంది ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలని ప్రభుత్వాన్ని అరుణ్ సింగ్ కోరారు.