బాలీవుడ్ బ్యూటీ మౌనీ రాయ్ (Mouni Roy) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ‘నాగిని’ సీరియల్‌తో సౌత్‌లో ఫేమస్ అయింది. ఆ తర్వాత బాలీవుడ్‌లో పలు సూపర్ హిట్ సీరియల్స్, సినిమాల్లో నటిస్తూ తనకంటూ ప్రత్యేక స్థానం సంపాదించుకుంది. సోషల్ మీడియాలో కూడా యాక్టివ్‌గా ఉంటూ, తరచూ గ్లామరస్ ఫొటోలు, భర్త సూరజ్తో కలిసి దిగిన రొమాంటిక్ పిక్స్ షేర్ చేస్తూ అభిమానులకు మరింత దగ్గరైంది.
అయితే తాజాగా ఈ జంటకు సంబంధించిన ఓ వార్త సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. మౌనీ రాయ్, సూరజ్ నంబియార్ విడాకులు తీసుకోబోతున్నారంటూ రూమర్స్ వినిపిస్తున్నాయి. దీనికి కారణం.. సోషల్ మీడియాలో ఈ ఇద్దరూ ఒకరినొకరు అన్‌ఫాలో చేసుకోవడం. సూరజ్ తన ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ నుంచి పెళ్లి ఫొటోలను కూడా డిలీట్ చేయడం చర్చనీయాంశమైంది. ఈ క్రమంలోనే వీరి వైవాహిక జీవితంలో సమస్యలు తలెత్తాయా? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
మరోవైపు, కొంతకాలంగా మౌనీ రాయ్.. తన భర్తతో కలిసి ఎలాంటి ఫొటోలు, వీడియోలు షేర్ చేయకపోవడం కూడా ఈ రూమర్స్‌కు మరింత బలం చేకూర్చింది. దీంతో అభిమానులు సోషల్ మీడియాలో స్పందిస్తూ.. “మీ ఇద్దరూ విడిపోవద్దు.. అన్నీ బాగానే ఉండాలని కోరుకుంటున్నాం” అంటూ కామెంట్లు చేస్తున్నారు. అలాగే,“ప్రైవసీ కోసం ఇలా చేసి ఉండొచ్చు.. అధికారిక ప్రకటన వచ్చే వరకు ఎలాంటి రూమర్స్ వైరల్ చేయొద్దని” మరికొందరు అభిప్రాయపడుతున్నారు. అయితే ఈ వార్తలపై ఇప్పటివరకు ఈ జంట ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు.
Recent Instagram activity by Mouni Roy and Suraj Nambiar has sparked curiosity among fans, as many noticed they no longer follow each other on the platform. 👀🥺#MouniRoy #SurajNambiar #BollywoodNews #CelebrityBuzz #FilmyGalaxy pic.twitter.com/zdDYLNtRKA
— Filmy Galaxy (@Filmy_Galaxy) May 12, 2026
అయితే ఈ వార్తలపై ఇప్పటివరకు మౌనీ రాయ్-సూరజ్ నంబియార్ జంట ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు. కాగా, ఈ జంట 2022లో గోవాలో మలయాళీ, బెంగాలీ సంప్రదాయాల ప్రకారం ఘనంగా వివాహం చేసుకున్నారు. బిజినెస్ మెన్ అయిన సూరజ్, బెంగళూరుకు చెందిన జైన కుటుంబం నుంచి వచ్చాడు. మౌనీ రాయ్ మాత్రం పక్కా బెంగాలీ.
ఇక మౌనీ రాయ్ ఆచార, సంప్రదాయాలను గౌరవిస్తూ సూరజ్ చేసుకున్న వీరి పెళ్లి అప్పట్లో టాక్ అఫ్ ది బాలీవుడ్ అయింది. అంతేకాదు అప్పట్లో ఈ జంట పెళ్లి ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ప్రస్తుతం మౌనీ రాయ్, వరుణ్ ధావన్తో కలిసి ‘హై జవానీ తో ఇష్క్ హోనా హై’ చిత్రంలో నటిస్తోంది.
