ఒక్కరే.. అయితే చిక్కులే..!

ఒక్కరే.. అయితే చిక్కులే..!

ఒక్కరైతేనే బాగా పెంచుతాం.. ఇబ్బంది పడకుండా అన్నీ సమకూరుస్తాం.. ఇలా అనే చాలామంది సింగిల్ చైల్డ్ ఆప్షన్ ఎంచుకుంటున్నారు. ‘వన్ ఈజ్ బెస్ట్’ అనే కాన్సెప్ట్‌‌ను సెలక్ట్ చేసుకుంటున్నారు.  సింగిల్ చైల్డ్ ఆప్షన్​పై పిల్లలు, పేరెంట్స్​ , ఎక్స్​పర్ట్స్​ చెప్తున్న ఒపీనియన్స్​ ఇవి ..

మంది ఎక్కువైతే మజ్జిగ పలచబడుతుంది అన్నట్టు ఇంట్లో పిల్లలు ఎక్కువైతే బాధ్యతలు కూడా ఎక్కువవుతాయి. దానికితోడు భార్యాభర్తలిద్దరూ ఉద్యోగాలు చేస్తుంటే పిల్లలతో స్పెండ్ చేసే టైం ఉండదు. అందుకే చాలామంది బాబైనా, పాపైనా ఒక్కరే  చాలనుకుంటున్నారు. ఒక్కరే ఉంటే అమ్మానాన్నల అటెన్షన్ తమపైనే ఉంటుందని పిల్లలు అంటుంటే, పిల్లలకు తోబుట్టువులు లేని లోటు తీర్చలేకపోతున్నాం అని పేరెంట్స్ అంటున్నారు. ఒంటరిగా పెరిగిన పిల్లలు డిఫరెంట్ థింకింగ్‌‌తో పెరుగుతారని చెబుతున్నారు ఎక్స్ పర్ట్స్.

తోబుట్టువులు లేని లోటు తీర్చాలి

‘‘మేము కావాలనే సింగిల్ చైల్డ్ ఆప్షన్ కి వెళ్లాం. కానీ అది రాంగ్ డెసిషన్ అని ఎప్పుడూ అనుకుంటా. పిల్లలకు ఫ్యామిలీ సపోర్టు ఎప్పుడూ ఉంటుంది. కానీ ఉద్యోగాల వల్ల వాళ్లతో ఎక్కువ టైమ్​ స్పెండ్ చేయలేం. అలా స్పెండ్ చేసేది తోడుగా పుట్టేవారొక్కరే. మా పాప తనకు ఎనిమిదేళ్లు వచ్చేంత వరకూ సింగిల్ గా ఉన్నా బాగా ఎంజాయ్ చేసేది. ఆ తర్వాత నుంచీ నాకు తమ్ముడో, చెల్లో కావాలంటూ గొడవ చేస్తుంది. చదువులో బిజీగా ఉన్నా ఇంట్లో ఉన్నంత సేపు బోర్‌‌‌‌గానే ఫీల్ అవుతుంది. అందుకే పిల్లలకు పక్కనే ఉండి తోబుట్టువులు లేని లోటు తీరుస్తామనే నమ్మకం ఉన్న పేరెంట్స్ మాత్రమే సింగిల్ చైల్డ్ ఆప్షన్‌‌కి వెళ్తే బాగుంటుంది అనేది నా అభిప్రాయం”అంటోంది నల్గొండకు చెందిన శ్రావణి.

కాన్సన్‌‌ట్రేషన్ పెట్టాల్సిందే..

‘‘మానాన్నకు మేము నలుగురు పిల్లలం. ఎక్కువమంది ఉండడం వల్ల అందరికీ చదువు సరిగా అందలేదు. అందుకే ఒక్క సంతానం అయితే బాగా చదివించొచ్చు అనే ఆలోచనతో సింగిల్ చైల్డ్ ఆప్షన్‌‌కి వెళ్లాం. ఇద్దరం ఉద్యోగాలు చేస్తున్నాం. దీనివల్ల బాబు పుట్టిన కొన్నాళ్ల వరకూ చాలా ఇబ్బంది పడ్డాం. తర్వాత నా  వైఫ్ ఉద్యోగం మానేసి బాబుతో ఉంది. ఇప్పుడు పెద్దవాడవుతుంటే కూడా అదే పరిస్థితి. సింగిల్ చైల్డ్ కావడంతో మా బాబును ఎప్పుడూ చూస్తూనే ఉండాల్సి వస్తుంది. వాడు బోర్ ఫీల్ అయినా, ఒంటరిగా ఉన్నట్లు ఫీల్ అయినా చాలా బాధపడుతుంటాం. అందుకే తనపై ఎక్కువ కాన్సన్ ట్రేషన్ చేయాల్సి వస్తోంది. ఎప్పటికప్పుడు కొత్త కొత్త బొమ్మలు, కొత్త కొత్త గేమ్స్ ఇవ్వాల్సి వస్తోంది. అదే ఇద్దరు పిల్లలుంటే ఈ ప్రాబ్లమ్ ఉండేది కాదనిపిస్తుంది”అనేది  హైదరాబాద్‌‌కు చెందిన రాజేంద్ర ఒపీనియన్.

ఆలోచనా విధానం మారుతుంది 

‘‘సింగిల్ చైల్డ్ బెస్ట్ అని మా హజ్బెండ్ ఎప్పుడూ చెప్పేవారు. అందుకే మేము ఒక చైల్డ్‌‌కే ప్లాన్ చేసుకున్నాం. కానీ, తర్వాత అర్ధమైంది. ఒక్కరుంటే ఎప్పుడూ ఒంటరిగానే పెరుగుతారు. వాళ్ల ఆలోచన విధానం కూడా మారుతుంది. షేరింగ్ చేయరు. నలుగురిలో కలవరు. సింగిల్‌‌గా ఉండడానికే ఇష్టపడతారు. కానీ ఇది పెద్దయ్యాక వేరే కుటుంబంతో కలిసి ఉండాల్సి వచ్చినప్పుడు ఇబ్బంది అవుతుంది’’అంటున్నారు నల్గొండ వాసి సుజాత.

ఇద్దరు కావాల్సిందే

‘‘నేను సింగిల్ చైల్డ్ కావడంతో నన్ను మా పేరెంట్స్ చాలా కేరింగ్​ గా చూసుకునేవాళ్లు. ఎక్కువ ప్రేమను అందించేవాళ్లు. కానీ చిన్నప్పటి నుంచి ఎప్పుడూ ఎక్కడకు వెళ్ళేవాడ్ని కాదు. ఎవరితోనూ కలిసేవాడ్ని కాదు. ఫ్రెండ్స్ చాలా తక్కువ. పెద్దయ్యాక దాన్ని ఓవర్ కమ్ చేయడానికి చాలా కష్టపడ్డా. చాలా మంది ఫ్రెండ్స్‌‌ని పెంచుకున్నా. ఇంట్లో ఇద్దరు పిల్లలు ఉండాలి. అప్పుడే ఒకరికొకరు తోడుగా ఉంటారు. అందుకే నా చాయిస్ అయితే ఇద్దరు పిల్లలు ఉంటే బాగుంటుంది’’అన్నాడు హైదరాబాద్‌‌కు చెందిన పవన్.

 

అటెన్షన్ అంతా నాపైనే

‘‘సింగిల్ చైల్డ్ కావడం నాకు ప్లస్ పాయింట్ అనుకుంటా. ఎందుకంటే ఒక్కదాన్నే కావడం వల్ల మా అమ్మానాన్నల అటెన్షన్ అంతా నాపైనే ఉంటుంది. కంపారిజన్ ఉండదు. కానీ, ఎప్పుడైనా ఆడుకోవాలంటేనే తోడు ఉండరు. అప్పుడే బోర్‌‌‌‌గా ఫీల్ అవుతుంటా. షేరింగ్ కూడా ఇబ్బందిగా ఉంటుంది. మొత్తంగా నేను సింగిల్ అయినా బాగా ఎంజాయ్ చేస్తా”అంటోంది ఎనిమిదో తరగతి చదువుతున్న సరయు.

నలుగురితో కలవడం అవసరం

సింగిల్ చైల్ట్ ఆప్షన్ సొంత నిర్ణయం. కానీ, ఇద్దరు పిల్లలుంటే ఇద్దరూ కలిసి తింటారు. ఒకరిపై మరొకరు కేర్ తీసుకుంటారు. ఇలాంటి వాటికి చిన్నప్పుడే పునాదులు పడతాయి. పెద్దయ్యాక అవే బాగా ఉపయోగపడతాయి. కానీ, సింగిల్ చైల్డ్ ఆప్షన్ లో అలాంటివేమీ ఉండవు. ‘అన్నీ నీకే’ అంటూ పిల్లల్ని పెంచుతారు. అడగకముందే అన్నీ అమర్చిపెడతారు. పేరెంట్స్ లో కూడా ఇన్ సెక్యూరిటీ ఫీలింగ్ ఉంటుంది. దానివల్ల అతి గారాబంతో పెరిగి పిల్లలు ఒకలా పెరుగుతారు. మంచైనా, చెడైనా పిల్లలకు ఎక్స్ పీరియెన్స్ లు ఉండాలి. కానీ అవి ఉండవు. ఇండివిడ్యువల్ యాటిట్యూడ్‌‌తో పెరుగుతారు. దానివల్ల భవిష్యత్తులో పిల్లలే బాగా ఇబ్బంది పడతారు. అందుకే పిల్లల్ని బంధువులు, ఫ్రెండ్స్ తో కలిసి పెంచాలి. పార్టీలకు, ఫంక్షన్లకు తీసుకెళ్లి అందరితో కలపాలి. తనకు దగ్గరగా ఉన్నవాళ్లతో మంచి బాండింగ్ ఉండేలా చూసుకోమని వివరించాలి. షేరింగ్, కేరింగ్ అలవాట్లు చేయాలి. ఫెయిల్యూర్స్‌‌ని కూడా యాక్సెప్ట్ చేసేలా పిల్లల్ని సిద్ధం చేయాలి” అని అంటున్నారు సైకాలజిస్ట్ రాధిక.

కలవరు..కలుపుకోరు

‘‘స్కూల్లోఉన్నప్పుడు కొంతమంది సింగిల్ చిల్డ్రన్​ డిఫరెంట్ గానే ఉంటారు. ఎవరితోనూ ఎక్కువగా కలవరు. ఎవర్నీ కలుపుకోరు. షేరింగ్ కూడా చాలా తక్కువ. ఇలాంటి విషయాలు నా ముందుకు వచ్చినప్పుడు కచ్చితంగా పిల్లలకు చెబుతా. అందరితో కలిసి ఉంటే వచ్చే లాభాలేంటో వివరిస్తా. ఒకవేళ ఒక్కర్నే కన్నా పేరెంట్స్ ఎక్కువ  టైం వారితో​ స్పెండ్ చేయకపోతే పిల్లలు ఒంటరితనం ఫీల్ అవుతుంటారు. ఇలా ఎవరైనా ఒంటరిగా కూర్చుని ఉంటే నేను వాళ్ల పేరెంట్స్ కు ఇన్ఫామ్ చేస్తుంటా. వాళ్లతో టైమ్​ స్పెండ్ చేయమని చెబుతుంటాం’’అని హైదరాబాద్‌‌కు చెందిన షమా టీచర్ అంటోంది.

 

For More News..

లైసెన్స్‌‌‌‌‌‌‌‌ లేని వాళ్లకు బండిస్తే రూ. 5 వేలు ఫైన్

పోతిరెడ్డిపాడు పక్కనే రాయలసీమ లిఫ్ట్‌

ఎలక్ట్రిక్‌‌ బైకులకు నో ట్యాక్స్‌‌, నో రిజిస్ట్రేషన్‌‌ ఫీజు

సంపూర్ణ అక్షరాస్యత ఊసేలేదు.. నీతి ఆయోగ్ పదేపదే అలర్ట్ చేసినా పట్టించుకోలేదు