హెల్త్, ఫిట్నెస్ కోసం డైట్ ఫాలో అవుతున్నారా.. తినడంతో తికమకపడొద్దు..

హెల్త్, ఫిట్నెస్ కోసం డైట్ ఫాలో అవుతున్నారా.. తినడంతో తికమకపడొద్దు..

డైటింగ్...హెల్త్, ఫిట్నెస్ కోసమని ఒక్కొక్కరు తీరొక్క డైట్ ఫాలో అవుతారు..... 'ఏం తింటున్నాం. 'ఎంత తింటున్నాం?' అని పక్కాగా లెక్కేసుకుని తింటారు. చాలామంది. డైట్ పరంగా చాలా కాన్షియస్ గా ఉంటారు. అనుకున్న రిజల్ట్ కనిపించేదాకా పొట్ట నిండా తినరు. బయటి ఫుడ్ కొంచెం కూడా నోట్లో పెట్టరు. అయితే ఒకేరకం పుడికి అలవాటు పడడం వల్ల వీళ్లకి కొన్ని రకాల విటమిన్లు, న్యూట్రియెంట్లు అందవు. దాంతో 'ఈటింగ్ డిజార్డర్ల బారిన పడతారు. అలర్జీలతో పాటు ఆరోగ్య సమస్యలు కూడా వస్తాయి. ఈ ఇబ్బందులేవీ రాకూడదంటే ... బ్యాలెన్స్ డైట్ తినడమే సొల్యూషన్ అంటున్నారు న్యూట్రిషనిస్టులు.

హెల్దీ ఫుడ్ కోసం, ఫిట్ గా ఉండడం కోసం డైట్ పాటిస్తుంటారు కొందరు. పూర్తిగా వీగన్ డైట్ కి మారిన వాళ్లు మరి కొందరు... ఇలా డైట్ ప్లాన్ లో ఉన్నవాళ్లు డైట్ లో ఉన్నఫుడ్స్ తప్ప మిగతావేవీ ముట్టుకోరు. దాంతో సరిపోను పోషకాలు అందక కొన్నిరకాల సమస్యలు వస్తాయి.

అలా అలవాటైతే...

డైటింగ్ చేస్తున్నవాళ్లు ఒకరకం ఫుడికి అలవాటు పడతారు. పూర్తిగా వీగన్ డైటికి మారిన వాళ్లకి విటమిన్ బి 12 సరిపోను అందదు. డిప్రెషన్, నిద్రలేమి, అనీమియా వంటివి రాకుండా ఉండాలంటే విటమిన్ 12 చాలా అవసరం. అంతేకాదు డైట్ ప్లాన్లో ఉన్న కొందరికి విటమిన్ -డి దొరకదు. దాంతో క్యాల్షియం లోపం ఏర్పడి ఎముకల ఆరోగ్యం, జీవక్రియల పనితీరు మీద ఎఫెక్ట్ పడుతుంది. హెల్దీఫుడ్ తీసుకునేవాళ్లకి బ్లడ్ టెస్ట్ చేస్తే, కొన్నిరకాల మినరల్స్, విటమిన్లు తక్కువ ఉన్నట్లు తేలింది కూడా. ఒకే డైట్ ప్లాన్కి అలవాటైన వాళ్లు, తర్వాత నార్మల్ ఫుడ్ తినడానికి ఇబ్బంది పడతారు. ఒకవేళ తిన్నా వెంటనే వాంతి చేసుకుంటారు. ఫుడ్ అలర్జీ వస్తుంది. 

ఆర్థోరెక్కియా..

దీన్నే 'క్లీన్ ఈటింగ్ డిజార్డర్' అంటారు. ఈ డిజార్డర్ ఉన్నవాళ్లకి 'హెల్దీఫుడ్ తింటున్నామా? లేదా? అనే ఆలోచన మాత్రమే ఉంటుంది. అంతేతప్ప తిన్న ఫుడ్ నుంచి రోజుకి కావాల్సిన ఎనర్జీ వస్తోందా? తినడంలో తికమకలోదు! లేదా? అని ఆలోచించరు. డైట్ ప్లాన్ కోసం ఎక్కువ టైమ్ తీసుకుంటారు. కొన్నిరకాల ఫుడ్ ఐటెమ్స్ ని మొత్తానికే తినడం ఆపేస్తారు. 

వీళ్ల ఇవేకాకుండా నలుగురిలో కలిసిపోలేరు. చిన్న విషయాలకే టెన్షన్ పడడం, మానసిక ఒత్తిడికి లోనవ్వడం వీళ్లలో ఎక్కువ. అందుకే వీళ్లు బ్రీతింగ్ ఎక్సర్సైజ్లు, ధ్యానం, యోగ వంటివి చేయాలి. ఇలాంటివాళ్లని సైకాలజిస్ట్ కు చూపించి కౌన్సెలింగ్ ఇప్పించాలి. శరీరంలోని అన్ని అవయవాలు ఆరోగ్యంగా ఉండాలన్నా, చక్కగా పనిచేయాలన్నా న్యూట్రిషియస్ ఫుడ్ ఎంత ముఖ్యమో చెప్పాలి. అలాగే డైటీషియన్ని కలిసి బ్యాలెన్స్ డ్ డైట్ ప్లాన్ పాటించాలి.

ఈటింగ్ డిజార్డర్లు..

స్ట్రెక్ట్ గా డైట్ పాటించడం వల్ల ఈటింగ్ డిజార్డర్లు వచ్చే ఛాన్స్ ఉంది. ఉదాహరణకు డయాబెటిస్ ఉన్నవాళ్లు పూర్తిగా షుగర్ తక్కువ ఉన్న డైట్ పాటిస్తారు. ఒబెసిటీ ఉన్నవాళ్లు ఆ సమస్యని తగ్గించే డైట్ మీదే ఫోకస్ పెడతారు. ఈ క్రమంలో బ్యాలెన్స్డ్ ఫుడ్ తీసుకోరు. ముఖ్యంగా చాలామందిలో కనిపించే ఈటింగ్ డిజార్డర్స్ ఆర్థోరెక్సియా, అనెరెక్సియా నెర్వోసా. బులిమియా నెర్వోసా. డైట్ అన్నిరకాల పోషకాలు ఉండవు. దీంతో పోషకాహార లోపం ఏర్పడుతుంది. బరువు తగ్గిపోతారు కూడా.. 

ఇవి మరవొద్దు..

ఒకేరకం డైట్ ప్లాన్ని ఎక్కువ రోజులు పాటించొద్దు. అనుకున్న రిజల్ట్ రాగానే అన్నిరకాల ఫుడ్స్ తినాలి. పండ్లు, కూరగా యలు ఎక్కువగా తినాలి. ప్రొటీన్, ఫ్యాట్, విటమిన్లు ఉన్న బ్యాలెన్స్డ్ డైట్ కంటిన్యూ చేయాలి. డైటింగ్లో ఉన్నా అప్పుడప్పుడు చీట్మీల్స్ చేసినా పర్లేదు. పోషకాలున్న ఫుడ్ తింటూ, ఎక్సర్సైజ్ లు చేస్తే ఆరోగ్య సమస్యలు రాకుండా జాగ్రత్తపడొచ్చు.

అనెరెక్సియానెర్వొసా..

ఈ డిజార్డర్ పూర్తిగా ఫుడికి సంబంధించింది కాదు. ఈ సమస్య ఉన్నవాళ్లు తక్కువ బరువు ఉంటారు. బరువు పెరుగుతామేమో?, బాడీ షేప్ మారుతుందేమో? అనే భయంతో ఫాస్టింగ్ చేస్తారు. తినడం బాగా తగ్గిస్తారు. వీళ్లని ఫిజీషియన్కి చూపించి, ట్రీట్మెంట్ ఇప్పించాలి.

బలిమియా..

ఇదొక సీరియస్ ప్రాబ్లమ్. ఈ సమస్య ఉన్నవాళ్లు ఎక్కువ తింటారు. వీళ్లకి తినడం మీద కంట్రోల్ ఉండదు. అయితే ఎక్కువ క్యాలరీలు ఒంట్లో చేరితే బరువు పెరుగుతామోననే భయం ఉంటుంది. దాంతో ఎక్కువ తిన్నప్పుడు బలవంతంగా వాంతి చేసుకుంటారు. ఈ డిజార్డర్ ఉంటే మానసిక ఆరోగ్యం దెబ్బతింటుంది. న్యూట్రిషనిస్టుని కలిసి బ్యాలెన్స్డ్ డైట్ తీసుకుంటే ఈ సమస్య తగ్గుతుంది.