
జగిత్యాల జిల్లా ధర్మపురి మండలంలోని నేరెళ్ల గ్రామ సమీపంలో ఆర్టీసీ బస్సుకు పెను ప్రమాదం తప్పింది. జగిత్యాల డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు ధర్మపురి నుంచి జగిత్యాలకు వస్తుండగా .. నేరెళ్ల గ్రామ సమీపానికి రాగానే వెనుక టైరు ఊడిపోయింది. అయితే, డ్రైవర్ అప్రమత్తతతో పెద్ద ప్రమాదం తప్పింది.
వాహనం అదుపు తప్పి అక్కడే నిలిచి పోవడంతో కొద్దీ సేపు ప్రయాణికులు భయబ్రాంతులకు గురయ్యారు. ఎవరికీ ఏలాంటి గాయాలు కాకపోవడం ఊపిరి పీల్చుకున్నారు. బస్సులో సామర్థ్యానికి మించి ప్రయాణికులు ఉన్నందున ఈ ఘటన చోటుచేసుకున్నట్లు స్థానికులు తెలిపారు. ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉంది.