నిందితుల ఫేక్ కొవిడ్ రిపోర్ట్ పై పోలీసుల వాగ్వాదం

నిందితుల ఫేక్ కొవిడ్ రిపోర్ట్ పై పోలీసుల వాగ్వాదం

గోవా డ్రగ్స్ కేసులో హైదరాబాద్ పోలీస్, గోవా పోలీసుల మధ్య వార్ జరుగుతోంది. ఇప్పటికే  డ్రగ్స్ కింగ్ పిన్ డిసౌజాని సిటీ పోలీసులు ఆరెస్ట్ చేశారు. ప్రస్తుతం ఎడ్విన్ అరెస్ట్ పై సస్పెన్స్ కొనసాగుతోంది. ఎడ్విన్ మకాం దగ్గరకు వెళ్లిన హైదరాబాద్ పోలీసులకు...తనకు కోవిడ్ పాజిటివ్ అంటూ అనుచరులు రిపోర్ట్ చూపించారు. రిపోర్ట్ ఇచ్చిన ల్యాబ్ కు వెళ్లి వెరిఫై చేయగా.... ఫేక్ కొవిడ్ రిపోర్ట్ అని తేలింది. ఇదే విషయంపై గోవా పోలీసులకు, హైదరాబాద్ పోలీసులు సమాచారం ఇచ్చారు. అయితే ఆ ఫేక్ రిపోర్ట్ ను తామే కనిపెట్టామని గోవా పోలీసులు చెబుతున్నారు. ఎడ్విన్ పై ఫోర్జరీ కేస్ నమోదు చేశామని తెలిపారు. మరోవైపు డిసౌజా దగ్గర దొరికిన 168 హైదరాబాదీ డ్రగ్ కస్టమర్లు ఎవరనేది హైదరాబాద్ పోలీసులు ఆరా తీస్తున్నారు.

డ్రగ్స్ కింగ్ పిన్ డిసౌజా అలియాస్ స్టీవ్ ని ఐదు రోజుల కస్టడీ కోరుతూ పోలీసులు నాంపల్లి కోర్టులో పిటిషన్ వేశారు. కస్టడీ పిటిషన్ పై ఇవాళ విచారణ జరగనుంది. మూడు రోజుల కిందట గోవాలో స్పెషల్ ఆపరేషన్ నిర్వహించి కింగ్ పిన్ ను హైదరాబాద్ పోలీసులు అరెస్ట్ చేశారు . దేశవ్యాప్తంగా కింగ్ పిన్ కు 600 మంది కస్టమర్స్ ఉన్నట్టు తెలుస్తోంది. వీరిలో హైదరాబాద్ లో 168 మంది డ్రగ్స్ కస్టమర్స్ ను పోలీసులు గుర్తించారు.