తెలంగాణ కుర్రాడికి ఇంటర్నేషనల్ చెస్ టైటిల్‌‌‌‌

తెలంగాణ కుర్రాడికి ఇంటర్నేషనల్ చెస్ టైటిల్‌‌‌‌
  • అర్జున్‌ సూపర్‌ 
  • టాటా స్టీల్‌ చాలెంజర్‌ చెస్‌ టైటిల్‌ సొంతం
  • మరో రౌండ్‌ మిగిలుండగానే గెలిచిన తెలంగాణ కుర్రాడు

హైదరాబాద్‌‌‌‌‌‌‌‌‌‌, వెలుగు: ఇండియా గ్రాండ్‌‌‌‌మాస్టర్‌‌‌‌, తెలంగాణ యంగ్‌‌‌‌స్టర్ ఎరిగైసి అర్జున్‌‌‌‌ ఎత్తులకు ఎదురులేకుండా పోయింది. వరంగల్​కు చెందిన ఈ కుర్రాడు మరో ఇంటర్నేషనల్ టైటిల్‌‌‌‌ సొంతం చేసుకున్నాడు. నెదర్లాండ్స్‌‌‌‌లో జరుగుతున్న టాటా స్టీల్‌‌‌‌ ఇంటర్నేషనల్‌‌‌‌ చాలెంజర్‌‌‌‌ చెస్‌‌‌‌ టోర్నీ చాంపియన్‌‌‌‌గా నిలిచాడు. స్టార్టింగ్‌‌‌‌ నుంచే సూపర్‌‌‌‌ పెర్ఫామెన్స్‌‌‌‌ చేసిన 18 ఏళ్ల అర్జున్‌‌‌‌ మరో రౌండ్‌‌‌‌ మిగిలుండగానే టైటిల్‌‌‌‌ ఖాయం చేసుకున్నాడు. ఈ పెర్ఫామెన్స్‌‌‌‌తో 2023లో జరిగే టాటా స్టీల్‌‌‌‌ చెస్‌‌‌‌ మాస్టర్స్‌‌‌‌ టోర్నీకి క్వాలిఫై అయ్యాడు.  శనివారం జరిగిన 12వ రౌండ్‌‌‌‌లో  తెలంగాణ కుర్రాడు 15 ఎత్తుల్లో చెక్‌‌‌‌ రిపబ్లిక్‌‌‌‌ గ్రాండ్‌‌‌‌ మాస్టర్‌‌‌‌ ఎన్‌‌‌‌గుయెన్‌‌‌‌ డై వాన్‌‌‌‌తో గేమ్‌‌‌‌ను డ్రా చేసుకున్నాడు. దీంతో 9.5 పాయింట్లతో టాప్‌‌‌‌ ప్లేస్ అర్జున్‌‌‌‌ సొంతమైంది. ఎన్‌‌‌‌గుయెన్‌‌‌‌తో పాటు డెన్మార్క్‌‌‌‌కు చెందిన జొనాస్‌‌‌‌ బుల్‌‌‌‌  చెరో ఎనిమిది పాయింట్లతో జాయింట్‌‌‌‌గా సెకండ్‌‌‌‌ ప్లేస్‌‌‌‌లో ఉన్నారు. దాంతో, 1.5 పాయింట్ల లీడ్‌‌‌‌లో ఉన్న అర్జున్‌‌‌‌  ఆదివారం జరిగే 13వ రౌండ్‌‌‌‌ రిజల్ట్‌‌‌‌తో సంబంధం లేకుండా టైటిల్​ నెగ్గాడు.

మంచి స్టార్ట్​ దక్కలే..
ఈ విక్టరీపై అర్జున్‌‌‌‌ సంతోషం వ్యక్తం చేశాడు. ‘ఈ టైటిల్‌‌‌‌ నెగ్గడం చాలా అద్భుతంగా అనిపిస్తోంది.  టోర్నీలో నాకు మంచి స్టార్ట్‌‌‌‌ దక్కలేదు.  ఫస్ట్‌‌‌‌ రౌండ్‌‌‌‌లోనే విక్టరీ చేజారినా తర్వాత  బాగా ఆడుతూ ముందుకొచ్చా.  ఇండియాలో జరిగిన ఇదే టోర్నీలో ర్యాపిడ్‌‌‌‌ టైటిల్‌‌‌‌ గెలిచా. నెక్స్ట్‌‌‌‌ ఇయర్‌‌‌‌ జరిగే మాస్టర్స్‌‌‌‌ ఈవెంట్‌‌‌‌కు క్వాలిఫై అయినప్పటికీ ఇప్పుడే దాని గురించి ఆలోచించడం లేదు. ప్రస్తుతానికి మరిన్ని టోర్నమెంట్లు ఆడుతూ బెస్ట్​ ఇవ్వాలని  చూస్తున్నా. హార్డ్‌‌‌‌వర్క్‌‌‌‌ చేస్తూ వచ్చే ఏడాది మాస్టర్స్‌‌‌‌ టోర్నీ వరకూ బెటర్‌‌‌‌ ప్లేయర్‌‌‌‌ అవ్వాలని అనుకుంటున్నా’ అని చెప్పాడు.  అర్జున్‌‌‌‌ పెర్ఫామెన్స్‌‌‌‌ను  వరల్డ్‌‌‌‌ చాంప్‌‌‌‌ మాగ్నస్‌‌‌‌ కార్ల్‌‌‌‌సన్‌‌‌‌ ఇటీవల మెచ్చుకున్నాడు. అతను  తొందర్లోనే 2700 రేటింగ్‌‌‌‌ పాయింట్స్‌‌‌‌ అందుకుంటాడని చెప్పాడు. ‘మాగ్నస్‌‌‌‌ లాంటి లెజెండరీ ప్లేయర్‌‌‌‌ నుంచి అలాంటి మాటలు వినడం నిజంగా చాలా గ్రేట్‌‌‌‌ ఫీలింగ్‌‌‌‌.  ఇది నా కాన్ఫిడెన్స్‌‌‌‌ను మరింత పెంచుతుంది’ అని అర్జున్‌‌‌‌ అన్నాడు.