మాములుగానే బాలయ్య అంటేనే చాలా పవర్ఫుల్.. మరి అలాంటి బాలయ్యను ఢీకొట్టే విలన్ ఇంకెంత పవర్ఫుల్ గా ఉండాలి. బాలకృష్ణ హీరోగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో బాలయ్యను ఢీకొట్టేందుకు బాలీవుడ్ ఒకప్పటి హీరోని తీసుకొచ్చారు. అతను ఎవరో కాదు. నేషనల్ అవార్డు విన్నర్ అర్జున్ రాంపాల్.. ఈ విషయాన్ని అతనే ఇన్ స్టాగ్రామ్ ద్వారా స్వయంగా వెల్లడించాడు.
బాలయ్య 108 పేరుతో రూపొందుతున్న ఈ సాలిడ్ ఎంటర్టైనర్ లో బాలయ్య డ్యూయల్ షేడ్స్ లో కనిపించనున్నారు. బాలయ్య సరసన కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తుండగా, మరో హీరోయిన్ శ్రీలీల బాలయ్య కూతురి పాత్రలో నటిస్తుంది. ప్రస్తుతం సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఈ ఏడాది దసరాకు సినిమాను రిలీజ్ చేసేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు, షైన్ స్క్రీన్స్ బ్యానర్‌పై సాహు గారపాటి, హరీష్ పెద్ది ఈ సినిమాను నిర్మిస్తున్నారు.