మాస్క్‌‌‌‌ పెట్టుకోలేదని జవాన్‌‌‌‌ను చావబాదిన్రు

మాస్క్‌‌‌‌ పెట్టుకోలేదని జవాన్‌‌‌‌ను చావబాదిన్రు

రాంచీ: మాస్క్‌‌‌‌ పెట్టుకోలేదనే కారణంతో ఓ ఆర్మీ జవాన్‌‌‌‌ను పోలీసులు తీవ్రంగా కొట్టారు. ఈ ఘటన బుధవారం జార్ఖండ్‌‌‌‌లోని ఛత్ర జిల్లాలో జరిగింది. జిల్లాలోని కర్మ బజార్‌‌‌‌‌‌‌‌ ప్రాంతంలో పోలీసులు మాస్క్‌‌‌‌ డ్రైవ్‌‌‌‌ నిర్వహిస్తున్నారు. ఆ టైమ్‌‌‌‌లో ఆరా భూసాహి గ్రామానికి చెందిన ఆర్మీ జవాన్‌‌‌‌ పవన్‌‌‌‌ కుమార్‌‌‌‌‌‌‌‌ యాదవ్‌‌‌‌ తన బైక్‌‌‌‌పై వచ్చాడు. పోలీసులు అతన్ని ఆపి మాస్క్‌‌‌‌ ఎందుకు పెట్టుకోలేదని ప్రశ్నిస్తూ.. బైక్‌‌‌‌ తాళాలను గుంజుకున్రు. పోలీసుల నుంచి తన బైక్‌‌‌‌ తాళాలను పవన్​ తీసుకునే ప్రయత్నం చేశాడు. ఈ క్రమంలో పోలీసులు, జవాన్‌‌‌‌ మధ్య గొడవ మొదలైంది. దీంతో పోలీసులు.. ఆ జవాన్‌‌‌‌ను కిందపడేసి కాళ్లతో తంతూ.. లాఠీలతో తీవ్రంగా కొట్టారు. జవాన్‌‌‌‌ను కొట్టడంపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేయడంతో తర్వాత అతన్ని పోలీసు స్టేషన్‌‌‌‌ తరలించారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌‌‌‌గా మారింది. అయితే జవాన్‌‌‌‌ను కొట్టిన పోలీసుల్లోనే చాలామంది మాస్క్‌‌‌‌లు పెట్టుకోకపోవడం గమనార్హం. ఈ ఘటనకు సంబంధించి ముగ్గురు పోలీసులను, ఇద్దరు ఇతర అధికారులను సస్పెండ్‌‌‌‌ చేశారు. జవాన్‌‌‌‌ను కొట్టిన పోలీసులపై చర్యలు తీసుకోవాలని స్థానిక 
ఎంపీ డిమాండ్‌‌‌‌ చేశారు.