పోలీస్ శాఖలో కరోనా కలకలం  

పోలీస్ శాఖలో కరోనా కలకలం  

ఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీ కరోనా విజృంభిస్తోంది. నిత్యం వైరస్ బారిన పడుతున్నవారి సంఖ్య భారీగా పెరుగుతోంది. మహమ్మారి కట్టడికి అలుపెరగకుండా శ్రమిస్తున్న పోలీసులు సైతం కరోనా మహమ్మారి బారిన పడుతున్నారు. కానిస్టేబుల్ నుంచి ఉన్నతాధికారుల వరకు గత 10 రోజుల్లో 1000మందికి కరోనా సోకింది. ఢిల్లీ అడిషనల్ కమిషనర్ చిన్మయ్ బిస్వాల్, పబ్లిక్ రిలేషన్స్ ఆఫీసర్ సహా వెయ్యి మంది వైరస్ బారినపడ్డారని ఢిల్లీ పోలీసు శాఖ ప్రకటించింది. వైరస్ సోకిన పోలీసులందరికీ స్వల్ప లక్షణాలు మాత్రమే ఉన్నాయని.. వారందరినీ హోం క్వారంటైన్లో ఉంచి ట్రీట్మెంట్ ఇస్తున్నట్లు చెప్పింది. గత కొన్ని రోజులుగా ఢిల్లీలో భారీ స్థాయిలో కరోనా కేసులు నమోదవుతున్నాయి. ఆదివారం కొత్తగా 23,000 మంది కొత్తగా కరోనా బారినపడ్డారు. ప్రస్తుతం ఢిల్లీలో పాజిటివిటీ రేటు 23శాతంగా ఉంది. 

మరోవైపు ముంబైలోనూ పలువురు పోలీసు సిబ్బందికి కరోనా సోకింది. గత 48 గంటల్లో 13మంది డిప్యూటీ కమిషనర్లు, నలుగురు అడిషనల్ కమిషనర్లు, ఒక జాయింట్ సీపీతో పాటు మరో 114 మంది పోలీసులకు కోవిడ్ పాజిటివ్గా నిర్థారణ అయింది.

For more news..

జల్లికట్టు నిర్వాహణపై వీడిన సస్పెన్స్

ప్రధానికి రక్షణ కల్పించడంలో పంజాబ్ ప్రభుత్వం విఫలం