జల్లికట్టు నిర్వాహణపై వీడిన సస్పెన్స్

జల్లికట్టు నిర్వాహణపై వీడిన సస్పెన్స్

చెన్నై: తమిళనాడులో జల్లికట్టు నిర్వాహణపై ఉత్కంఠ వీడింది. ఏటా నిర్వహించే సంప్రదాయ ఆట జల్లికట్టుకు ఈ ఏడాది కూడా పర్మిషన్ ఇస్తున్నట్లు సీఎం స్టాలిన్ ప్రకటించారు. కానీ జల్లికట్టు నిర్వాహణపై పలు ఆంక్షలు విధించారు. ఈ మేరకు తమిళనాడు ప్రభుత్వం మార్గదర్శకాలు జారీ చేసింది. పోటీలను చూసేందుకు 150 మంది ప్రేక్షకులు లేదా 50శాతం సీటింగ్ సామర్థ్యానికి అనుమతించింది. డబుల్ డోస్ వ్యాక్సినేషన్ తీసుకున్న పోటీదారులు, ప్రేక్షకులను అనుమతించనున్నట్లు ప్రకటించింది. వ్యాక్సిన్ తీసుకోని వారు పోటీల ప్రారంభానికి 48గంటల ముందు కోవిడ్ నెగిటివ్ సర్టిఫికెట్ చూపాల్సి ఉంటుంది. కరోనా కేసుల సంఖ్య భారీగా పెరుగుతున్నందున ప్రజలు జల్లికట్టును టీవీల్లో చూడాలని రాష్ట్ర ప్రభుత్వం సూచించింది. తమిళనాడులో ఏటా కనుమ పండుగ రోజున జల్లికట్టును నిర్వహిస్తారు. మధురైకి సమీపంలోని అలంగనల్లూరులో నిర్వహించే పోటీలను చూసేందుకు భారీ సంఖ్యలో జనం హాజరవుతారు. 

గత కొన్ని రోజులుగా తమిళనాడులో కరోనా కేసులు గణనీయంగా పెరుగుతున్నాయి. ఆదివారం ఒక్కరోజే 12,895 మంది కొత్తగా వైరస్ బారిన పడ్డారు. ప్రస్తుతం తమిళనాడులో 51,335 యాక్టివ్ కేసులున్నాయి. కరోనా విజృంభన దృష్ట్యా రాష్ట్రంలో అన్ని యూనివర్సిటీల ఎగ్జామ్స్ను నెల రోజుల పాటు వాయిదా వేశారు.

For more news..

హీరో సిద్ధార్థ్ ట్విట్టర్ అకౌంట్ బ్లాక్ చేయాలె

ఫ్యాన్స్కు హృతిక్ రోషన్ బర్త్ డే ట్రీట్