
హైదరాబాద్, వెలుగు: రానున్న వారం రోజుల్లో టీఎస్ ఎంసెట్ షెడ్యూల్ రిలీజ్ చేసేందుకు ఉన్నత విద్యామండలి ఏర్పాట్లు చేస్తోంది. జేఈఈ మెయిన్ ఎగ్జామ్స్ తేదీలు మారడంతో ఇంటర్ ఎగ్జామ్స్ తేదీలు కూడా ఇటీవలే మార్చారు. దీంతో ఎంసెట్ షెడ్యూల్ రిలీజ్ వాయిదా పడింది. మే 24 దాకా ఇంటర్ పరీక్షలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో జులైలో ఎంసెట్ నిర్వహించేందుకు అధికారులు కసరత్తు చేస్తున్నారు. కాగా, టీఎస్ ఎంసెట్‌కు ఎక్కువగా ప్రిపేర్ అయ్యేందుకు స్టూడెంట్లకు టైమ్ ఇవ్వాలని ఉన్నత విద్యా మండలి భావిస్తోంది. జేఈఈ అడ్మిషన్ల ప్రక్రియ పూర్తయ్యే దాకా ఎంసెట్ అడ్మిషన్లు పూర్తికావు. మరోపక్క జేఈఈ మెయిన్ –2, అడ్వాన్స్‌డ్‌కు టైమ్ ఉంది. దీంతో ముందే ఎంసెట్ పెట్టడంతో ఉపయోగం లేదనే ఉద్దేశంతో ప్రిపరేషన్‌కు ఎక్కువ టైమ్ ఇచ్చే యోచనలో ఉంది.