అరెస్టు చేయమంటున్న 104 ఏళ్ల బామ్మ!

అరెస్టు చేయమంటున్న 104 ఏళ్ల బామ్మ!

ఇంగ్లండ్ లోని బ్రిస్టల్ కు చెందిన అన్నె బ్రోకెన్ బ్రో అనే బామ్మ వయసు 104 ఏళ్లు. ఆమె ఓ సంస్థలో సెక్రెటరీగా పని చేసి రిటైర్ అయ్యింది. ప్రస్తుతం బ్రిస్టల్ ప్రాంతం, స్టోక్ బిషప్ లోని ఓ కేర్ హోమ్ లో ఉంటోంది. అన్నె మనవరాలు సాషా ఆధ్వర్యం లో స్టోక్ లీ అనే ఒక సంస్థ పని చేస్తోంది. ఈ కేర్ హోమ్ పరిధిలో వృద్ధుల్ని సంరక్షిస్తుంటారు. అలాగే వాళ్ల తీరని కోరికలుంటే తీర్చేందు కు ప్రయత్నిస్తారు. స్థానికంగా ఉండే కొన్ని స్టోర్లలో ‘విషింగ్ వాషింగ్ లైన్’ పేరుతో ఇటీవల ప్రత్యేకంగా ఒక సెక్షన్ ఏర్పాటు చేశారు. ఇక్కడ కొన్ని పేపర్లను అతికిస్తారు. ఎవరైనా వృద్ధులు తమ తీరని కోరికల్ని వాటిపై రాయాల్సి ఉంటుం ది.షాప్ కొచ్చే కస్టమర్లలో ఎవరైనా వాటిని చూసి, ఆ వృద్ధుల కోరిక తీర్చాలనుకుం టే స్టోక్ లీ సంస్థను సంప్రదిస్తారు. ఇలా ముందు కొచ్చే కస్టమర్ల సాయంతో వృద్ధుల కోరికలను తీరుస్తుంటారు. సాధారణంగా వృద్ధులు ఖరీదైన రోల్స్ రాయిస్ కారులో ప్రయాణించడం, స్థానికంగా ఉండే మోటార్ సైకిల్ క్లబ్ ను సందర్శించడం వంటి కొన్ని సాధ్యమయ్యే కోరికలే రాస్తుం టారు.

బామ్మ కోరిక…..

అయితే అందరికీ భిన్నంగా ఆ పేపర్ పై అన్నె మాత్రం తనకు అరెస్టు కావాలని ఉందని రాసింది. తన పేరు అన్నె అని,వయసు 104 ఏళ్లని రాసింది. జీవితంలో చట్టానికి తానెప్పుడూ వ్యతిరే కంగా లేనని, అందువల్ల తనను అరెస్టు చేయాలని పేర్కొంది. ఇది చూసిన స్టోక్ లీ కేర్ కో ఆర్డినేటర్ కెల్లీ లూయిస్ ముందు ఆశ్చర్యపోయినా ఆమె కోరికను తీర్చాలని నిర్ణయించుకుంది.

అరెస్టుకు సిద్ధం….

అన్నె కోరిక అసాధ్యమేమీ కాదు కాబట్టి, ఆమె కోరిక తీర్చాలని ఆ సంస్థ నిర్ణయించుకుంది. ఈ విషయాన్నిస్థానిక పోలీసులకు చెప్పింది కెల్లీ. పోలీసులు కూడా ఆమెను అరెస్టు చేసి, తన కోరిక తీర్చేందు కు సిద్ధమయ్యారు. త్వరలోనే ఆమెను అరెస్టు చేస్తామని పోలీసులు ప్రకటించారు. ఎలాగైతేనేం అరెస్టు కావాలన్న బామ్మ కోరిక తీరబోతోంది.