ఆర్టికల్ 370 మూవీ గల్ఫ్‌‌‌‌ దేశాల్లో నిషేధం

ఆర్టికల్ 370 మూవీ గల్ఫ్‌‌‌‌ దేశాల్లో నిషేధం

యామి గౌతమ్, ప్రియమణి లీడ్ రోల్స్‌‌‌‌లో నటించిన చిత్రం ‘ఆర్టికల్ 370’.  నేషనల్ అవార్డ్ విన్నింగ్ డైరెక్టర్‌‌‌‌‌‌‌‌ ఆదిత్య సుహాస్‌‌‌‌ జంభాలే డైరెక్ట్ చేశాడు. జియో స్టూడియోస్ సమర్పణలో ఆదిత్య ధ‌‌‌‌ర్ నిర్మించారు. గత శుక్రవారం విడుదలైన ఈ చిత్రం పాజిటివ్‌‌‌‌ టాక్‌‌‌‌తో దూసుకెళ్తోంది. అయితే గల్ఫ్‌‌‌‌ దేశాలు ఈ చిత్రంపై బ్యాన్ విధించాయి. ఇందులో కొన్ని సన్నివేశాలు తమకు అభ్యంతరకరంగా ఉండటం వల్లే ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. 

ఇటీవల హృతిక్ రోషన్ ‘ఫైటర్’పై కూడా గల్ఫ్‌‌‌‌ దేశాలు నిషేధం విధించాయి. ఇక జమ్ముకశ్మీర్‌‌‌‌‌‌‌‌కు ప్రత్యేక ప్రతిపత్తిని కల్పించే ఆర్టికల్‌‌‌‌ 370ని ర‌‌‌‌ద్దు చేసే క్రమంలో.. అక్కడ ఎలాంటి సంఘటనలు చోటుచేసుకున్నాయనేది ‘ఆర్టికల్ 370’ మూవీ కాన్సెప్ట్‌‌‌‌. పవర్‌‌‌‌ఫుల్‌‌‌‌ ఇంటెలిజెన్స్ ఆఫీస‌‌‌‌ర్‌‌‌‌గా యామీ గౌతమ్ నటించింది. ‘రామాయణం’ ఫేమ్ అరుణ్ గోవిల్ ప్రధాని నరేంద్ర మోదీ పాత్రను పోషించారు. ‘కొన్ని విషయాల గురించి సరైన సమాచారం తెలుసుకునేందుకు ‘ఆర్టికల్ 370’ లాంటి సినిమాలు చూడాలని’ ఇటీవల ప్రధాని మోదీ ఓ సందర్భంలో  ప్రస్తావించారు.