ఇండియా అంతరంగిక విషయాల్లో తలదూర్చకండి

ఇండియా అంతరంగిక విషయాల్లో తలదూర్చకండి

ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు

న్యూఢిల్లీ: ఇండియా అంతర్గత వ్యవహారాల్లో దాయాది దేశాలతోపాటు ఇతర నేషన్స్ తలదూర్చొద్దని వైస్ ప్రెసిడెంట్ ఎం.వెంకయ్య నాయుడు సూచించారు. జమ్మూ కాశ్మీర్‌తోపాటు దేశ రక్షణ, సమగ్రత, సార్వభౌమత్వాన్ని దృష్టిలో ఉంచుకొనే ఆర్టికల్ 370ని రద్దయినట్లు పేర్కొన్నారు. ఇండియా ఓ పార్లమెంటరీ ప్రజాస్వామ్య దేశమని.. జమ్మూ కాశ్మీర్‌‌కు స్పెషల్ స్టేటస్ ఇస్తున్న ఆర్టికల్ 370 రద్దుపై పార్లమెంట్‌లో మెజారిటీ సభ్యుల ఆమోదంతో నిర్ణయం తీసుకున్నామని వెంకయ్య సుస్పష్టం చేశారు.

పంజాబ్ యూనివర్సిటీలో బీజేపీ దివంగత నేత సుష్మా స్వరాజ్ తొలి మెమోరియల్ లెక్చర్‌‌లో వెంకయ్య పైవ్యాఖ్యలు చేశారు. రీసెంట్‌గా కాశ్మీర్ వివాదాన్ని తిరగదోడేందుకు యునైటెడ్ నేషన్స్‌లో చైనా యత్నించింది. ఈ నేపథ్యంలో ఇండియా అంతరంగిక విషయాల్లో తలదూర్చొద్దని వెంకయ్య నాయుడు హెచ్చరించారు. ఇతర దేశాలు వేరే కంట్రీస్ విషయాల్లో తల దూర్చడానికి బదులు తమ సొంత సమస్యలను పరిష్కరించుకోవడంపై దృష్టి పెట్టాలని సూచించారు.