కొంతకాలంగా తెలుగు సినిమాలు హిందీలో బాగానే రీమేక్ అవుతున్నాయి. రీసెంట్‌గా ‘అర్జున్‌రెడ్డి’ రీమేక్ అక్కడ రికార్డులు బద్దలు కొట్టింది. దాంతో అక్కడ రీమేక్ ప్లాన్స్ బాగా ఎక్కువైనట్లు తెలుస్తోంది. చాలామంది నిర్మాతలు తెలుగు సినిమా రైట్స్ తీసుకుని, వాటిని తెరకెక్కించే పనుల్లో పడ్డారు. వాటిలో ‘అరుంధతి’ ఒకటి. తెలుగులో ఈ సినిమా సృష్టించిన సంచలనం అంతా ఇంతా కాదు. అనుష్క ఇమేజ్‌ని ఒక్కసారిగా మార్చేసిన మూవీ అది. నిజానికి ఈ చిత్రాన్ని హిందీలో రీమేక్ చేస్తున్నారనే వార్త ఎప్పుడో వినిపించింది. కానీ ఏవేవో అవాంతరాల వల్ల వాయిదా పడుతూ వచ్చింది. ఇప్పుడు రీమేక్ హవా నడుస్తోంది కనుక ఎలాగైనా తీయాలనే పట్టుదలతో ఉన్నారట.
అనుష్క పాత్ర కోసం కరీనా కపూర్‌ని సంప్రదించినట్లు తెలుస్తోంది. పెళ్లి తర్వాత గ్యాప్ తీసుకున్నా, రీ ఎంట్రీ ఇచ్చి బిజీ అయిపోయింది కరీనా. రెండు మూడు సినిమాలతో పాటు ఒక టెలివిజన్ షో, ఎఫ్‌ఎమ్ ప్రోగ్రామ్ కూడా చేస్తోంది. కాబట్టి ఆమె ఒప్పుకుంటుందా అనే సందేహం కూడా ఉందట. తను కాదంటే అనుష్కాశర్మని తీసుకుందామని సెకెండ్ ఆప్షన్‌గా పెట్టుకున్నా, కరీనాని ఒప్పిస్తేనే బెటర్ అని ఆలోచిస్తున్నారట. మరి ఆమె ఒప్పుకుంటుందో లేదో.

