ఈడీ కస్టడీ నుంచే కేజ్రీవాల్ పాలన.. ఫస్ట్ ఆర్డర్స్ ఇలా ఉన్నాయి

ఈడీ కస్టడీ నుంచే కేజ్రీవాల్ పాలన.. ఫస్ట్ ఆర్డర్స్ ఇలా ఉన్నాయి

ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో అరెస్టైన అరవింద్  కేజ్రీవాల్ సీఎం పదవికి రాజీనామా చేస్తారా లేకా జైలు నుంచి పరిపాలన కొనసాగిస్తారా అన్న ప్రశ్నలకు తెరపడింది. 2024 మార్చి 24వ తేదీ ఆదివారం రోజున  జైలు నుంచే పాలన ప్రారంభించారు. ఈడీ కస్టడీ నుంచే ఆయన ఫస్ట్ ఆర్డర్స్ జారీ చేశారు. ఢిల్లీకి  మంచినీటి సరఫరా విషయంలో ఆదేశాలు జారీ చేశారు.  

దీనిని ఓ నోట్‌ రూపంలో నీటి సరఫరాకు సంబంధించిన సంబంధిత మంత్రి అతిషికి కేజ్రీవాల్ పంపించారు. ఢిల్లీలోని పలు ప్రాంతాల్లో నీళ్ల సమస్యలు ఉన్నాయి. ప్రజలు ఎవరూ కూడా ఇబ్బంది పడకూడదు.  ఈ విషయంలో  అవసరమైతే లెఫ్ట్ నెంట్ గవర్నర్ సహాయం తీసుకోండని సూచించారు.  దీనిపై మంత్రి విలేఖర్లకు సమాచారం ఇవ్వనున్నారు. 

కాగా మనీలాండరింగ్‌ చట్టం ఉల్లంఘన ఆరోపణలపై  మార్చి 21వ తేదీన కేజ్రీవాల్‌ను ఈడీ అధికారులు  అరెస్టు చేశారు. ఆ తర్వాత కోర్టు ఆయన్ను మార్చి 28 వరకు ఈడీ కస్టడీకి ఇచ్చింది. కానీ ఆయన ఇప్పటి వరకు సీఎం పదవికి రాజీనామా చేయులేదు.